పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్ గా ‘సలార్’ మూవీని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించనున్న ఈ పాన్ ఇండియా మూవీ కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. ఇటీవల హైదరాబాద్ లో ఈ సినిమా కోసం ఆడిషన్స్ కూడా నిర్వహించారు. త్వరలో బెంగుళూరు, చెన్నైలలో ఆడిషన్స్ నిర్వహించనున్నారు. ప్రభాస్ ను పవర్ ఫుల్ డాన్ గా చూపించనున్న ఈ క్రేజీ మూవీ జనవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే.. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు అనేది బయటకు వచ్చింది.

తాజా సమాచారం ప్రకారం.. సంక్రాంతి తర్వాత జనవరి 18 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మూవీ కోసం రామోజీ ఫిలింసిటీలో భారీ సెట్ వేస్తున్నారు. అందులోనే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ప్లాన్ చేశారు. హైదరాబాద్, బెంగుళూరులో ఈ మూవీ షూటింగ్ చేయనున్నారు. ఇక కథానాయిక విషయానికి వస్తే.. ఇప్పటి వరకు హీరోయిన్ ఎవరు అనేది ఎనౌన్స్ చేయలేదు కానీ.. దిశా పటానీ పేరు వినిపిస్తుంది. కేజీఎఫ్ కి వర్క్ చేసిన టెక్నీషియన్సే ఈ సినిమాకి కూడా వర్క్ చేయనున్నారు.
ఈ హై ఓల్టేజ్ యాక్షన్ మూవీని రికార్డ్ టైమ్ లో కంప్లీట్ చేస్తానని ప్రశాంత్ నీల్ ప్రభాస్ కి మాట ఇచ్చారట. అందుకనే ఈ సినిమాని ముందుగా స్టార్ట్ చేస్తున్నారు. సమ్మర్ కి ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి 2021 దసరాకి ఈ పాన్ ఇండియా మూవీని రిలీజ్ చేయాలనేది ప్లాన్. అయితే.. కరోనా సెకండ్ వేవ్ విదేశాల్లో స్టార్ట్ కావడంతో టీమ్ కాస్త టెన్షన్ పడుతుంది అంటున్నారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే.. 2021 దసరాకి సలార్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మరి.. ఏం జరగనుందో చూడాలి.
Must Read ;- ప్రభాస్.. మరో పాన్ ఇండియా మూవీ. ఇంతకీ ఎవరితో.?











