‘విక్కీడోనర్, అంధాధున్, బదాయీహో, గులాబో సితాబో’ లాంటి సినిమాలతో భారతీయ ప్రేక్షకుల మనసు దోచుకున్న యువ కథానాయికుడు ఆయుష్మాన్ ఖురానా. ప్రస్తుతం ఈ హీరో బాలీవుడ్ నిర్మాతలకు మినిమమ్ గ్యారెంటీ హీరో. అలాంటిఈ హీరో తాజాగా మరో వెరెటీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇటీవలే ఆ సినిమాను ప్రకటించాడు. దీనికి అనుభూతి కశ్యప్ దర్శకత్వం వహించనున్నారు. తన ఇన్ స్టా గ్రామ్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలియజేశాడు ఆయుష్మాన్. ‘డాక్టర్ జీ’ అనే వెరైటీ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా కు సంబంధించిన ఒక ఫోటోను పోస్ట్ చేశాడు.
అందులో తను స్క్రిప్ట్ బుక్ ను చూపిస్తూ రివీలయ్యాడు ఆయుష్మాన్. ‘త్వరలోనే సినిమా కోసం సంప్రదింపులు జరగనున్నాయి’ అంటూ ఫొటోతో పాటు పోస్ట్ చేశాడు. ఈ కథతో తాను ప్రేమలో పడిపోయానని అంటున్నాడు ఆయుష్మాన్. ఈ కథ సరికొత్తగా ఉంటుందని, ఒక కొత్త రకమైన ఆలోచనలో నుండి పుట్టిన కథ ఇది అని అంటున్నాడు. ఈ చిత్రంలో మంచి కామెడీతో పాటుగా సందేశం కూడా ఉంటుందని, తన సినీ జీవితంలో మొట్ట మొదటిసారిగా డాక్టర్ కోట్ వేసుకుంటున్నాని అంటున్నాడు ఈ హీరో.
‘డాక్టర్ జీ’ సినిమా బాలీవుడ్ ప్రేక్షకుల మనసులు తాకుతుందని తెలిపాడు ఆయుష్మాన్. దర్శకురాలు అనుభూతి కశ్యప్ ‘డాక్టర్ జి’ చిత్రంతోనే డైరెక్టర్ గా మారబోతోంది. ఆమె మాట్లాడుతూ ‘డాక్టర్ జి’ సినిమాతో తను డైరెక్టర్ గా మారబోతున్నానని తెలిపారు మూవీ సెట్స్ పైకి వెళ్లే క్షణాల కోసం త్రిల్లింగ్ గా ఎదురు చూస్తున్నానని, అలాగే ఆయుష్మాన్ ఖుర్రానా వంటి మంచి నటుడితో పనిచేయడం నిజంగానే ఆనందంగా ఉందని ఆమె అన్నారు. ఖచ్చితంగా సినిమా అందరికి నచ్చుతుంది అనే నమ్మకంతో ఉన్నానని చెప్పారు. ‘డాక్టర్ జీ’ సినిమాకు సుమిత్ సక్సేనా, విశాల్ వాగ్ మరియు సౌరభ్ భారత్ స్క్రిప్ట్ అందించారు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా స్క్రిప్ట్ ను రాశారని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలను త్వరలోనే ప్రకటించనున్నారు దర్శకనిర్మాతలు.
Must Read ;- ప్రభాస్ ‘సలార్’ సరసన బాలీవుడ్ బ్యూటీ?