వైఎస్ఆర్ సీపీలో కామ పిశాచులకు కొదవే లేదనేలా మరో నేత అడ్డంగా దొరికిపోయారు. ఒక ప్రజా ప్రతినిధి అనే యావ కూడా లేకుండా కామంతో కళ్లు మూసుకుపోయి, ముద్దులు పెడుతూ వీడియో కాల్స్ చేసిన వీడియో ఇప్పుడు సంచలనం అవుతోంది. అంతటితో ఆగకుండా వీడియో కాల్ లో ప్రైవేటు పార్ట్ లను చూపిస్తూ శునకానందం పొందుతున్న వైసీపీ ఎమ్మెల్సీ ఆనంత బాబు వీడియోను చూసిన వారంతా ఉమ్మేస్తున్నారు. ఇప్పటికే ఆయన తన డ్రైవర్ ను హత్య చేసి డోర్ డెలివరీ చేసి హంతకుడు అనే ఆరోపణలను నెత్తిన వేసుకున్నారు. ఇప్పుడు పార్టీకి ఉన్న వైకామ పార్టీ అనే ట్యాగ్ లైన్ ను సార్థకం చేశారు.
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వద్ద ఇలాంటి కామ లీలలు, నేర చరిత్రే కాక ఇంకోవైపు అక్రమాలు కూడా ఉన్నాయి. వైసీపీ అధికారంలో ఉండగా రంపచోడవరం ఏజెన్సీలో ఆయన అరాచకాలకు అంతే లేకుండా ఉండేది. గంజాయి రవాణా నుంచి కలప స్మగ్లింగ్ వరకు అంతా ఆయన కనుసన్నల్లోనే జరిగేది. అలాంటి ఎమ్మెల్సీ ఓ సొంత పార్టీకి చెందిన ఓ మహిళతో న్యూడ్ వీడియో కాల్‌లో ముద్దులు పెడుతూ మాట్లాడుతూ, ప్రైవేటు పార్ట్ లను చూపిస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో ఎమ్మెల్సీ అనంతబాబు ఆ వీడియో నాది కాదు.. మార్ఫింగ్ చేసి నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారంటూ కాకమ్మ కబుర్లు చెబుతున్నారు. పైగా తన వీడియోపై పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు. డబ్బులు ఇవ్వకుంటే వీడియో సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి తన నుంచి రూ.13.30 లక్షలు దోచుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
మరి బెదిరింపుదారులకు డబ్బులు ఇచ్చినట్లుగా ఆధారాలు చూపాలని పోలీసులు అడగ్గానే.. ఆ వివరాలు కూడా అనంత బాబు చూపించారు. మార్ఫింగ్ వీడియోకి బ్లాక్ మెయిల్ చేస్తే ఆ సమయంలోనే ఫిర్యాదు చేయాలి కదా అనే అనుమానం వ్యక్తం అవుతోంది. మే నుంచి జూన్ 24 వరకు ఇద్దరు మహిళలు, మరో ఇద్దరు పురుషుల ఖాతాల్లో జమ చేసినట్లు బ్యాంకు ఫైల్స్ అందజేశారు. తనకు న్యాయం చేయాలని కోరారు. వారి పేర్లు బైరు వాసు గౌడ్, కె.సంతోష్ కుమార్, మరో ఇద్దరు మహిళల ఖాతాలు, ఫోన్ పే నంబర్లను పోలీసులకు ఇచ్చారు.
మరి అది నిజంగా మార్ఫింగ్ వీడియోనే అయితే.. బ్లాక్‌మెయిల్ వ్యవహారాన్ని దాచి పెట్టాల్సిన అవసరమే లేదు. ఆ బ్లాక్ మెయిల్ చేసినప్పుడే పోలీసులకు చెప్పి ఉండొచ్చు. కానీ, అది నిజమైన వీడియో అయినందునే అనంతబాబు తన ముద్దుల వ్యవహారాన్ని దాచి పెట్టాలనుకున్నారని అంటున్నారు. నిజమైన వీడియోతో డబ్బులు డిమాండ్ చేయడం వల్లనే.. వారికి డబ్బులిచ్చి ప్రతిష్ఠను కాపాడుకోవాలనుకుని అనంతబాబు ప్రయత్నించినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పుడు అనంత బాబు.. ఆ వీడియో తనదే అని, మార్ఫింగ్ చేసి బెదిరిస్తున్నారని కబుర్లు చెబుతున్నారు.











