నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా పటాస్. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద సక్సస్ సాధించింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో పటాస్ 2 ఉంటుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే.. అనిల్ రావిపూడి వరుసగా సక్సస్ సాధించడం.. పెద్ద హీరోలతో సినిమాలు చేస్తుండడంతో ఇక కళ్యాణ్ రామ్ తో అనిల్ రావిపూడి సినిమా చేయకపోవచ్చు.. ఇక పటాస్ 2 లేనట్టే అంటూ ప్రచారం జరిగింది.
ప్రచారంలో ఉన్న ఈ వార్తల పై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ అనిల్ రావిపూడి ఏం చెప్పారంటే.. పటాస్ సక్సస్ తర్వాత కలిసి ఇంకో సినిమా చేద్దాం అనుకున్నాం. మా మధ్య చాలా కథలు చర్చకొచ్చాయి కూడా. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఓ కథ కూడా కళ్యాణ్ రామ్ కి చెప్పాను. కథ విని చాలా బాగుందని మెచ్చుకున్నారు. నా కెరీర్ లో మూడో సినిమా కళ్యాణ్ రామ్ తోనే చేయాలి అనుకున్నాను కానీ.. దురదృష్టవశాత్తూ సెట్ అవ్వలేదు.











