పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్. క్రేజీ స్టార్ రానా దగ్గుబాటి కూడా ఇందులో నటించడంతో ఈ భారీ, క్రేజీ మల్టీస్టారర్ పై కామన్ ఆడియన్స్ లో సైతం క్యూరియాసిటీ ఏర్పడింది. అంచనాలు పెంచేసింది. అయితే.. ఎప్పుడో రావాల్సిన భీమ్లా నాయక్ అన్ని అడ్డంకులనూ దాటుకుని ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. దీంతో పవర్ స్టార్ అభిమానుల్లో రోజురోజుకూ భీమ్లా నాయక్ పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.
అయితే… ఇప్పటివరకు టీజర్స్ రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన ఈ మూవీ టీజర్స్ అన్నింటికీ ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో భీమ్లా నాయక్ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో రిలీజ్ చేస్తారా..? లేక అంతకంటే ముందు రిలీజ్ చేస్తారా..? అంటే ప్రీ రిలీజ్ ఫంక్షన్ కంటే ముందుగానే రిలీజ్ చేస్తారని తెలిసింది. ప్రస్తుతం ఈ మూవీ ట్రైలర్ ను కట్ చేసే పనిలో ఉన్నారట టీమ్.
ఇంతకీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఎప్పుడంటే.. ఫిబ్రవరి 21న అని తెలిసింది. అయితే.. ప్రీ రిలీజ్ ఫంక్షన్ డేట్ ని అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే ఈ డేట్ ను అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నారని సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఓవర్ సీస్ లో కూడా భారీగా 400 థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. దీంతో భీమ్లా నాయక్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయనుంది అనేది ఆసక్తిగా మారింది.











