అందాల్ని నిర్మొహమాటంగా ప్రదర్శించడాన్ని కొందరు బ్యూటీస్ ప్రొఫెషనల్ గా తీసుకుంటారు. సోయగాలు ప్రదర్శించడానికి కాకపోతే దాచుకోడానికా? అన్నట్టుగా తమ హాట్ నెస్ ను చాలా బోల్డ్ గా బహిర్గతం చేస్తారు. అలాంటి ముద్దుగుమ్మల్లో చెయితిరిగిన బ్యూటీ బాలీవుడ్ హాటీ రైమా సేన్. తల్లి మూన్ మూన్ సేన్ .. ఒకప్పుడు బాలీవుడ్ ను ఒక ఊపు ఊపిన హీరోయిన్. అమ్మమ్మ సుచిత్రాసేన్ బెంగాలీ సినీ పరిశ్రమకే ఒకప్పుడు మహానాయకి. అలాంటి అందాల ఫ్యామిలీ నుంచి వచ్చిన రైమా సేన్.. ఇప్పటి జెనరేషన్ లో సాధారణ హీరోయిన్ గా ఉంటే దర్జా తగ్గిపోదు? అందుకే ఆమె వారిద్దరికన్నా రెండాకులు ఎక్కువే చదివింది.
బాలీవుడ్, బెంగాలీ మూవీస్ లో ఎంతో హాట్ నెస్ ను ప్రదర్శించే అమ్మడిని .. ధైర్యం సినిమాతో దర్శకుడు తేజా టాలీవుడ్ లో ఇంట్రడ్యూస్ చేశాడు. నితిన్ హీరోగా నటించిన ఆ సినిమా డిజాస్టర్ అయింది. అందుకే ఆమె తెలుగులో మరోసారి కనిపించలేదు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన బోల్డ్ ఫోటోస్ తో సంచలనం రేపే రైమా సేన్.. ఇన్ స్టా గ్రామ్ లో ఎంతో మంది ఫాలోవర్స్ ను ఏర్పరుచుకుంది. సినిమాల్లో కన్నా ఎక్కువగానే అక్కడ అందాల ప్రదర్శన చేయడం ఆశ్చర్యపరిచే విషయం.
లేటెస్ట్ గా రైమా సేన్ పోస్ట్ చేసిన టాప్ లెస్ ఫోటో ప్రస్తుతం ఇన్ స్టా గ్రామ్ ను షేక్ చేస్తోంది. బెంగాలీ సంచలన ఫోటో గ్రాఫర్ తథాగత ఘోష్ షూట్ చేసిన ఈ ఫోటోస్ కుర్రకారు ను నిద్రపట్టనీయకుండా చేస్తున్నాయి. స్పోర్టెడ్ బ్లూ డెనిమ్స్ లో ఎదపై ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా.,. కేవలం చిన్న వస్త్రాన్ని కప్పుకొని ఆమె ఇచ్చిన ప్రొఫైల్ సెన్సువల్ పోజ్ కు నెటిజెన్స్ షాక్ అయిపోతున్నారు. ఫోటోతో పాటు ఒక సెన్సువల్ ట్యాగ్ లైన్ ను కూడా పోస్ట్ చేసింది. రైమా ఫోటోస్ కి నెటిజెన్స్ నుంచి ఓరేంజ్ లో కామెంట్స్ పడుతున్నాయి. ‘బంగాళా ఖాతం లో జలకన్య’ అని ఒకరు కామెంట్ చేయగా.. నీ కళ్ళు అద్భుతమని మరొకరు కామెంట్ వదిలాడు.