సినీ ఇండస్ట్రిలో మోస్ట్ ఎలిజబుల్ లవర్స్ గా పేరు తెచ్చుకున్న జంట నయనతార, తమిళ సినీ దర్శకుడు విఘ్నేశ్ శివన్. దాదాపు ఏడేళ్ళ పాటు ప్రేమాయణం సాగించిన ఈ లవ్ బర్డ్స్ ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.కొన్నేళ్లుగా ప్రేమలో మునిగి తేలిన ఈ ప్రేమ పావురాలు ఈరోజు కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. మహాబలిపురంలోని షెరిటన్ హోటల్ లో హిందూ సాంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగింది.
నయన్ , విఘ్నేశ్ ల వివాహం కుటుంబ సభ్యులు,బంధువులు, స్నేహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది.వీరి వివాహాన్ని కోసం మహాబలిపురంలోని షెరటాన్ పార్క్ వద్ద భారీ అద్దాల మండపాన్ని నిర్మించారు.ఇక వీరి వివాహానికి రజినీకాంత్, షారూఖ్ ఖాన్, బోణీ కపూర్ సహా పలువురు సినీ ప్రముఖులు హాజరై ఈ జంటను ఆశీర్వదించారు. కాగా, తమ వివాహానికి ముందు విఘ్నేశ్ శివన్ సోషల్ మీడియాలో ఓ భావోద్వేగభరితమైన పోస్ట్ చేశాడు.
ఈ రోజు నయన్ డే.. మంచి వ్యక్తులు, మంచి సమయాలు, అనుకోని మధురమైన ఘటనలు, అందరి ఆశీస్సులు, దేవుడి ప్రార్థనలు, షూటింగ్ రోజులు… తన జీవితం ఇంత ఆనందంగా ఉండేందుకు ఇదే కారణమని తెలిపాడు. ఈ ఆనందమైన జీవితాన్ని ‘లవ్ ఆఫ్ మై లైఫ్’ నయన్ కు అంకితం చేస్తున్నానని.. పెళ్లికూతురుగా ముస్తాబై, వేదికపైకి వస్తున్న నయన్ ని చూసేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నానని తెలిపారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో జీవితంలో మరో అంకాన్ని ప్రారంభించేందుకు ఆనందంగా ఉన్నానని విఘ్నేశ్ శివన్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.