బస్సు సీట్ల కింద నోట్ల కట్టలు బయటపడ్డాయి. పద్మావతి ట్రావెల్స్ బస్సులో భారీగా నగదు పట్టుబడింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం వీరవల్లి టోల్ ప్లాజా వద్ద చోటుచేసుకుంది. శ్రీకాకుళం నుండి గుంటూరు వెళ్తున్న AP39 TB 7555 బస్సులో నగదు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.టోల్‌ప్లాజా వద్ద బస్సును పోలీసులు తనిఖీలు చేస్తుండగా బస్సులో నోట్ల కట్టలు కనిపించాయి.లగేజ్ డిక్కీలలో, సీట్లు కింద వాటిని ఉంచి రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక్క బాక్సులోనే సుమారు 80 లక్షల రూపాయల వరకూ నగదు ఉన్నట్లుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. బస్సులు అటువంటి బాక్సులు అనేకం ఉండడంతో కోట్లలో నగదు ఉండచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే పోలీసులు నగదును స్వాధీనం చేసుకుని టోల్ ప్లాజా కార్యాలయంలో భద్రపరచారు. ఉన్నతాధికారుల సమక్షంలో నగదును లెక్కించనున్నారు. ఇక బస్సు డ్రైవర్, క్లీనర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు నగదు ఎవరిది అనేయమశం పై ఆరా తీస్తున్నారు.
Must Read:-శ్రీకాకుళంలో మంత్రి V/S వలంటీర్స్