ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలకు మరోసారి బ్రేక్ పడింది. 01వ తేదీన పడాల్సిన ఉద్యోగుల జీతాలు 4 వ తేదీకి కానీ వచ్చే పరిస్థితి లేనట్టుగానే కనిపిస్తోంది. పే రోల్ వెబ్ నుంచి రిజర్వు బ్యాంకుకు బిల్లులు అప్‌లోడ్ కాకపోవడమే అందుకు కారణంగా తెలుస్తోంది.నిజానికి 31 వ తేదీ సాయంత్రానికే వేతనాల బిల్లును డ్రాయింగ్ అధికారులు అప్‌లోడ్ అయినప్పటికీ, సాంకేతిక సమస్యతో అప్‌లోడింగ్ ఆగిపోయింది.కాగా ఈ రోజు బిల్లులన్నీ సీఎఫ్ఎంఎస్ ద్వారా అప్లోడ్ చేయాలని డీడీవోలకు అధికారులు మళ్లీ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే సీఎఫ్ఎంఎస్ ద్వారా పెన్షన్ బిల్లులు అప్‌లోడ్ అయ్యాయి.అయితే వరుసగా సెలవులు రావడంతో ఎక్కువమంది డ్రాయింగ్ అధికారులు సెలవు పెట్టి వెళ్ళినట్లు సమాచారం.దీంతో సాయంత్రానికల్లా సీఎఫ్ఎంఎస్‌లో వేతనాల బిల్లులు అప్‌లోడ్ అయితే కానీ జీతాలు అందె పరిస్థితి కనిపించడం లేదు.ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఇక 4వ తేదీ తరువాతే అందె అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
డాక్టర్ రవిప్రకాశ్ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!
మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...











