నోరు .. ఊరు .. ఈ రెండు బాగుండాలంటే కంట్రోల్లో ఉండాలి!
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతోంది అని పెద్దలంటారు..! కానీ సిక్కోలు మంత్రికి ఈ సామెత అస్సల్ వర్కౌట్ అవ్వదు!! ఆయన నోటి దురుసుకు చివరికి వలంటీర్స్ కూడా ఉద్యోగాలు వదిలేసి .. రాజకీయాల్లోకి చేరి, ఆయన్నే విమర్శించే స్థాయికి మంత్రిగారు తెచ్చుకున్నారు… హతవిధి!! గతంతో రెవిన్యూ ఉద్యోగులను తీవ్రంగా అవమానించి రచ్చకెక్కారు. ఉద్యోగుల రోడ్డెక్కి మంత్రి క్షమాపణ చెప్పాలని పరువు తీశారు. అయిన దేవుడు సిగ్గుపెట్టలా..! నోటికి పనిచెప్పి … పీకేస్తే ఊడిపోయే మంత్రి పదవీని పట్టుకుని జిల్లాలో తన పరువును తానే తీసుకుంటున్నాడని విమర్శలు పాలౌతున్న ఆ దౌర్భగ్య మంత్రి సీదిరి! దేవుడు అవకాశం కల్పించి, సీఎం జగన్ రెడ్డి కేబినెట్ లో సింగల్ టేక్ లో మంత్రి అయ్యాడు సీదిరి అప్పలరాజు. వచ్చిన పదవీతో కాస్తాంత మంచి పనులు చేస్తూ.. తన నియోజకవర్గంలో, రాష్ట్రంలో పేరు తెచ్చుకోవాల్సింది పోయి .. చేతలకు చెప్పాల్సిన పనిని నోటికి చెప్పి తీవ్ర విమర్శల పాలౌతున్నారు.
పచ్చి పరాకాష్టకు చేరుకుంటే ఇలానే ఉంటుంది ..!
ఏపీ పశుసంవర్థక శాఖ మంత్రి సిక్కోల్లో వింతగా ప్రవర్తిస్తున్నారు. ఆయన పరుషపద ప్రయోగం ప్రతిపక్షంపైనే కాదు .. చివరికి ఉద్యోగులు, సచివాలయం సిబ్బంది పై కూడా ప్రదర్శించి ఇంటా బయట విమర్శలు పాలౌతున్నారు. పలాస మండలం గురుదాసుపురం పంచాయితీ పరిధిలో నలుగురు వలంటీర్స్ తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. పలాస టీడీపీ ఇంచార్జ్ గౌతు శిరీష సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. దీనికి కారణంగా మంత్రి వ్యవహార శైలేనని సొంతపార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీలను సైతం ఆయన మాటలతో తీవ్రంగా హట్ చేస్తున్నారని అధికార పార్టీ వారే ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇలా మంత్రి చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు తావిస్తున్నాయి











