మాస్ మహారాజా రవితేజ ‘క్రాక్’ సినిమాను విడుదలకు సిద్ధం చేశాడు ఈ సినిమాపై రవితేజ మంచి హోప్స్ పెట్టుకున్నాడు. ఇక రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ మూవీలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ‘క్రాక్’ తర్వాత రవితేజ నటించబోయేది ఈ సినిమాలోనే. ఈ సినిమాకు ఓ స్టార్ రైటర్ డైలాగ్స్ అందిస్తున్నట్లు తెలుస్తోంది. అయన మరెవరో కాదు రైటర్ బుర్రా సాయి మాధవ్. ఇప్పటికే ఆయన డైలాగ్స్ రాయడం మొదలుపెట్టారని సమాచారం.
రవితేజ సినిమాకు సాయి మాధవ్ డైలాగ్స్ అందించడం ఇదే మొదటిసారి. ఈ చిత్రం పక్కా ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇందులో రవితేజ డ్యూయల్ రోల్ లో నటించబోతున్నట్లు టాలీవుడ్ టాక్. రవితేజ సరసన రాశీఖన్నా, నిధి అగర్వాల్ హీరోయిన్లగా నటించనున్నారు. కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారుమరి ఈ చిత్రంతోనైనా మాస్ మహారాజాకు దర్శకుడు రమేష్ వర్మ మంచి హిట్ ఇస్తాడో లేదో చూడాలి.
Must Read ;- రవితేజ్ ‘క్రాక్’తో భూమ్ బద్దలే