మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ‘క్రాక్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే షూటింగ్ ను కంప్లిట్ చేసిన రవితేజ, తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. ఇందులో శృతిహసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ‘క్రాక్’ సినిమాపై టాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం తర్వాత రవితేజ నక్కిన త్రినాథ్ రావు దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు.
ఇప్పటికే రవితేజ రమేష్ వర్మ కథకు, అలాగే త్రినాథ్ రావు కథకు కూడా ఓకే చెప్పాడు. అయితే మాస్ మహారాజా ముందుగా దర్శకుడు త్రినాథ్ రావుతోనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. ‘క్రాక్’ సినిమా ఫుల్ యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కుతోంది. రమేష్ వర్మకు ఓకే చెప్పిన కథలో కూడా ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గానే ఉంటుందట. అందుకనే వెంట వెంటనే యాక్షన్ సినిమాలు చేయడం కరెక్ట్ కాదని మధ్యలో త్రినాథ్ రావు దర్శకత్వంలో సినిమా చేయాలని రవితేజ ఈ నిర్ణయం తీసుకున్నాడని టాక్.
త్రినాథ్ రావు తీయబోయే కథ ఫుల్ లెంత్ కామెడీతో సాగుతుందట. అసలే కామెడీతో కూడిన సినిమాలు తీయడంలో త్రినాథ్ రావు దిట్ట. ఇక కామెడీ విషయంలో రవితేజ కోసం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరూ కలిస్తే ఇక ఆ సినిమా ఖచ్చితంగా సమ్ థింగ్ స్పెషలే. ఇప్పటికే దర్శకుడు ఈ చిత్రానికి సంబంధించిన కథను పక్కాగా రెడీ చేసుకున్నాడని, వచ్చే ఏడాది జనవరిలో షూటింగ్ సెట్స్ పైకి వెళ్లనున్నదని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాపై ఒక అధికారిక ప్రకటన రాబోతుందని సమాచారం. మరి ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.
Must Read ;- లీగల్ సమస్యల్లో మాస్ మహారాజా సినిమా











