ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాజకీయం వాడీవేడి వాతారణాన్ని తలపిస్తున్నాయి.
ఏపీ రాజకీయాలను ఉత్తరాంధ్ర శాషిస్తాయి. ఇది అక్షర సత్యం. సామాజీకంగా.., రాజకీయంగా.., వ్యాపారపరంగా చెప్పుకుంటూ పోతే ఇలా ఏ రంగమైన విజయం సాధించాలంటే ఉత్తరాంధ్ర నుంచే ఎంచుకుంటారు. ఉత్తరాంధ్రలో సక్సెస్ అయితే.. ఏపీతోపాటు రెండూ తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఆ ఫార్మూలా వర్కౌట్ అవుతోంది. ఎందుకంటే ఉత్తరాంధ్ర సెంటిమెంటే కాదు.., విజ్ఞతతో కూడిన వ్యవహారశైలి ఇక్కడి వారి సొంతం కాబట్టి.
ఉత్తర దిక్కు మంచికి.. మంచి.. చెడుకు చెడు అన్న తీరులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న సెంటిమెంట్. ఇదే సెంటిమెంట్ అక్కడి అధికారపార్టీ నేతల్లో కలవరపెడుతోంది. సీనియర్లు.., ఓటమి ఎరుగని ధీర మంత్రులు.., ఎమ్మెల్యేలు సైత కొన్ని అంశాలు తీవ్ర మనస్తాపానికి గురి చేస్తున్నాయి. మచ్చుకకు కొన్ని చూసుకుంటే.. అధికార వైసీపీ భూ అక్రమణలు.., కేంద్రంతో చేతులు కలిసి విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయాలని చూడటం.., భూములను.., పోర్టులను ఆదానికి కట్టబెట్టడం.., విపరీతంగా గంజాయి సాగుచేయడం.., యువత బానిసలై చెడిపోవడం.., ఆలయాలపై దాడులు.., సింహాచలం భూములు.., ఆస్తులు కబ్జాలకు గురవ్వడం..,అక్రమ మైనింగ్ ఇలా చెప్పుకుంటూపోతే.. ఉత్తంరాంధ్రలో జరిగిన విధ్వంసాలు.. అన్నీఇన్నీ కావు. అందుకే వైసీపీలోని ఉత్తంరాంధ్ర నేతలు.., ఓటమి ఎరుగని ధీరులు సైతం తలలు పట్టుకుంటున్నారు.
మరోవైపు తెలుగుదేశం.., జనసేన పొత్తు.., ఉమ్మడి కార్యచరణతో ప్రభుత్వ వైఫల్యాలను.., ఉత్తరాంధ్ర ప్రాంతవాసులకు జరుగుతున్న అన్యాయం…, అవినీతిపై విపక్ష నేతలు పెద్దఎత్తున సాక్ష్యాలతో విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రశ్నిస్తు నిలదీస్తుంటే సమాధానాలు చెప్పలేకపోతోంది వైసీపీ.
దీంతో క్రమేపి వైసీపీ ప్రాభవం తగ్గి.. తెలుగుదేశం..,జనసేనలు ప్రాంతీయంగా పుంజుకుంటున్నాయి. వెనుకబడిన ఉత్తరాంధ్రకు చేసిందేమీ లేకపోగా.. ఇక్కడి సహజ వనరులను దోచుకోవడం.., ప్రశ్నిస్తున్న వారిపై దాడులు.., కేసులు పెట్టి చిత్ర హింసలకు గురిచేయడం స్ధానికంగా తీవ్ర మనస్తాపానికి గురి చేస్తోంది. ఎన్నికలు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తూ.. అధికార వైసీపీ మంత్రులు.., ఎమ్మెల్యేలపై నిప్పులు కురిపిస్తున్నారు ఆ ప్రాంత ప్రజలు. సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. చేసేది లేక వైసీపీలోని చాలా వరకు వైసీపీ సీనియర్ నేతలు వచ్చే ఎన్నికల్లో పోటీకి సుముఖంగా లేరు. మరోవైపు ఓ మంత్రి వైసీపీకి గుడ్ బై చెప్పి.. జనసేనలో చేరేందుకు రెడీ అవుతున్నారని ప్రచారం సాగుతోంది. ఏదీఏమైనా జగన్ అండ్ కో విధ్వంసకర పాలనకు చెప్పుతో కొట్టినట్లు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు ఉత్తరాంధ్ర ప్రజలు.