ఈ సంక్రాంతికి బంగార్రాజుకు బాగానే కలిసి వచ్చింది. పెద్ద సినిమాలు బరిలో లేకపోవడం, బంగార్రాజుతో విడుదలైన మిగతా సినిమాల్లో దమ్ములేకపోవడంతో బంగార్రాజు దుమ్ము లేపేశాడు. టాలీవుడ్ కింగ్ నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్యల క్రేజీ కాంబినేషన్లో రూపొందిన భారీ చిత్రం బంగార్రాజు. బ్లాక్ బస్టర్ మూవీ సోగ్గాడే చిన్ని నాయనకు చిత్రానికి సీక్వెల్ అయిన బంగార్రాజుకు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తే.. నాగచైతన్య సరసన కృతిశెట్టి నటించింది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యాన్ పై నాగార్జున ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
బంగార్రాజు చిత్రం మొదటి రోజు నుంచి కలెక్షన్లు బాగానే ఉన్నాయి. సినిమాకి యావరేజ్ టాక్ ఉన్నా కలెక్షన్ల పరంగా దూసుకువెళుతోంది. బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. వారాంతానికి లెక్కలు తీస్తే బాగానే గిట్టుబాటైంది. ఇదే ట్రెండ్‌ను కొనసాగిస్తూ బంగార్రాజు మూడు రోజు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించాడు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 50 గ్రాస్ వసూలు చేసింది. ఇది నాగార్జున, నాగ చైతన్య ఇద్దరి కెరీర్లో ఫస్ట్ వీక్ లో అత్యధిక కలెక్షన్లు అని చెప్పవచ్చు.
ఈత చిత్రానికి భారీ కలెక్షన్స్ వస్తుండడంతో… ఊహించినట్టుగానే.. బంగార్రాజు కోసం రెండవ రోజు నుండి అదనపు థియేటర్లును పెంచారు. ఈ నెలలో భారీ, క్రేజీ చిత్రాలు విడుదల లేకపోవడం బంగార్రాజుకు బాగా కలిసి వచ్చింది. దీంతో లాంగ్ రన్ లో బంగార్రాజు ఇంకా ఎంత కలెక్ట్ చేస్తాడు అనేది ఆసక్తిగా మారింది. మరి.. 100 కోట్ల మార్క్ ను బంగార్రాజు అందుకుంటాడో లేడో చూడాలి.