తమిళనాడు పీఠం ఎన్నాళ్లకైనా అధిష్టించాలని డీఎంకే అధినేత స్టాలిన్ కల. ఇప్పుడు ఆయన తన కలను నెరవేర్చుకున్నారు. శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డీఎంకే చీఫ్ స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఈ ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 234 స్థానాలున్న అసెంబ్లీలో 133 స్థానాలను డీఎంకే కైవసం చేసుకుంది. కరోనా నేపథ్యంలో స్టాలిన్ ప్రమాణస్వీకారం నిరాడంబరంగా సాగింది. రాజ్‌భవన్‌లో గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ స్టాలిన్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. తమిళనాడుకు స్టాలిన్ 14వ ముఖ్యమంత్రి. స్టాలిన్‌తోపాటు 34 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడులో పదేళ్ల తర్వాత డీఎంకే అధికారంలోకి వచ్చింది.











