తెలుగువారికి ఏమాత్రం పరిచయం అవసరం లేని చిత్రం “దసరాబుల్లోడు’. జగపతి ఆర్ట్ పిక్క్చర్స్ బ్యానర్ పై వి .బి. రాజేంద్ర ప్రసాద్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఎవర్ గ్రీన్ హిట్ సినిమా 1971, జనవరి 13వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదలయి అవార్డులు, రివార్డుల హద్దులు దాటిపోయింది.
ఈ స్వర్ణోత్సవ చిత్రం థియేటర్ ఉన్న ప్రతి గ్రామంలో కొత్త రికార్డు సృష్టించించింది. ముఖ్యంగా అందంగా ముస్తాబైన ప్రతి యువకుడు తనను తాను దసరాబుల్లోడు గా భావించేవాడు. అమ్మాయిలు ఒక అబ్బాయి అందంగా ఉంటాడు అనే చెప్పడానికి మారు పేరుగా దసరాబుల్లోడు లా ఉన్నాడు అని చెప్పేవారు. ఆరోజుల్లో దాదాపు రెండు కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించించింది. నేటికీ దసరాబుల్లోడు పులివేషం అని గ్రామాలలో వేస్తూ ఉంటారు.
ఈ సినిమాలో అనేక విశేషాలున్నాయి అక్కినేని నాగేశ్వరరావు కుర్రదనం, చిలిపితనం, రొమాన్స్ కలగలిపిన నటన, వాణీశ్రీ, చంద్రకళల గడుసుదనపు అభినయం.. గుమ్మడి-యస్ వి రంగా రావు ల హుందాతనం, సూర్యకాంతం గారి గయ్యాళి తనం, చిన్న చిన్న కుటుంబ కలహాలు, నాగభూషనం విలనిజం, చక్కని కామిడీ అక్కడక్కడ ట్రాజెడీ ఇలా అన్నీ రసాలు పండించిన ఈ దసరాబుల్లోడులో అతి ముఖ్యమైన ఆకర్షణ పాటలు. అక్కినేని వేసిన స్టెప్స్ అమోఘం. ప్రతి తెలుగువారి నోట ఈ పాటలే, ప్రతి కల్చరల్ కార్యక్రమాలలో ద్సరాబుల్లోడు పాటలే ఉండేవి. దాదాపు 20 సంవత్సరాలు పాటు ఈ దసరాబుల్లోడు పాటల హవా సాగింది. నేటికీ యూట్యూబ్ లో ఈ సినిమా పాటలు, సినిమా మిలియన్స వ్యూస్ లో కొనసాగుతున్నాయి. మామ మహదేవన్ స్వరకల్పన.. అపూర్వం.. అద్వితీయం.. ఈ సినిమాలోదాదాపు పది పాటలు ఉన్నాయి. అన్నీ అప్పటి జనాన్ని ఉర్రూతలూగించాయి.
తెలుగు చలనచిత్ర చరిత్రలో ఈస్ట్ మన్ కలర్ లో తొలిసారిగా స్వర్ణోత్సవం జరుపుకున్న చిత్రం గా , ఈస్ట్ మన్ కలర్ లో తొలి రజతోత్సవ చిత్రం గా , ఈస్ట్ మన్ కలర్లో తొలి ద్విశతదినోత్సవ చిత్రం గా , తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఈస్ట్ మన్ కలర్ లో తొలిసారిగా రెండు వందల యాభై నాలుగు రోజులు ప్రదర్శింపబడిన చిత్రం గానూ.. ‘దసరా బుల్లోడు’ తన ప్రత్యేకతను చాటుకుంది.
Must Read ;- బాలయ్య బ్లాక్ బస్టర్ హిట్ కి 20 ఏళ్లు!