టాలీవుడ్ లో మళ్ళీ రీమేకుల పర్వం మొదలైంది. ఏ భాషలో సినిమా అయినా.. సూపర్ హిట్ అయిందని తెలిస్తే చాలు.. చిన్న, పెద్ద హీరోలంతా.. తమకు ఆ సినిమా సూటబుల్ అని అనిపిస్తే ఆ సినిమా రైట్స్ ను కొనిపించేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో పదిహేను చిత్రాలకు పైగానే వివిధ భాషా చిత్రాలు రీమేక్ అవుతున్నాయి. ఈ క్రమంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, వెంకటేశ్ లాంటి హీరోలు.. పలు రీమేక్స్ మూవీస్ ను చేస్తుండగా.. ఆ లిస్ట్ లోకి ఇప్పుడు కొత్త కమెడియన్ కమ్ హీరో సునీల్ కూడా చేరిపోతున్నాడు.

కోలీవుడ్ స్టార్ కమెడియన్ .. యోగిబాబు ఇటీవలే ‘మండేలా’ అనే కామెడీ సెటైరికల్ మూవీ చేశాడు. అందులోని కొన్ని సన్నివేశాలు, డైలాగ్స్ కాంట్రావర్షియల్ కూడా అయ్యాయి. అయినప్పటికీ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకొని బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ నమోదు చేసుకున్న ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నాడట సునీల్. అయితే ముందుగా.. ఈ సినిమాను బండ్ల గణేశ్ చేయబోతున్నాడనే వార్తలు వినిపించాయి. ఇప్పుడు సునీల్ పేరు తెరమీదకు వచ్చింది.
ఎకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మాణంలో మండేలా రీమేక్ వెర్షన్ రూపొందనుందని సమాచారం. ఇంకా ఈ సినిమాకి దర్శకుడు ఎవరు అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. మరి ఈ వార్తలో నిజానిజలేంటో తెలియాలంటే.. నిర్మాతలైనా కన్ఫర్మ్ చేయాలి, లేక.. సునీల్ అయినా.. నోరు విప్పాలి. మరి సునీల్ నిజంగానే తెలుగు మండేలా అవుతాడో లేదో చూడాలి .











