ఏపీలో చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి.. పాలనపరంగా దూసుకుపోతూ ఉంటే.. అటు వైసీపీలో మాత్రం గుడి ఎనకనాసామి వ్యవహారాలు వెలుగు చూస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో హడావిడి చేసి.. సచ్ఛీలురుగా చెలామణి అయిన నేతలు ఇప్పుడు అడ్డంగా దొరికిపోతున్నారు. అవంతి శ్రీనివాస్, అంబటి రాంబాబు, ఎంపీ గోరంట్ల మాధవ్, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్, విజయసాయి రెడ్డి, దువ్వాడ శ్రీను లాంటి నాయకులు వరుసగా వాళ్ళ రాసలీలతో అడ్డంగా బుక్ అవుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వ హయాంలో దూకుడుగా మరో నేత బండారం బయటికి వచ్చింది.
కాకినాడ సిటీ నుంచి వరుసగా గెలుపొందుతూ వచ్చిన ఆయన గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాకినాడ తీరాన్ని కేంద్రంగా చేసుకొని బియ్యం అక్రమ రవాణా చేసేవారని ఆరోపణలు ఉన్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై చంద్రశేఖర్ రెడ్డి రోజూ విమర్శలు చేసేవారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతోనే కాకినాడ పోర్టు వేదికగా రేషన్ బియ్యం మాఫియాను మొదలుపెట్టారు. దీనిపై పవన్ కల్యాణ్ ఇప్పుడు పోకస్ చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ద్వారంపూడికి సంబంధించి బోలిశెట్టి సత్యనారాయణ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక దళిత మహిళతో అక్రమ సంబంధంలో ఉన్నారని ఆయన అన్నారు. అయితే, గర్భవతి అయిన ఆమెకు మగ లేదా ఆడ బిడ్డ అని తెలుసుకోడానికి స్కానింగ్ కూడా చేపించినట్లు బోలిశెట్టి ఆరోపించారు. ఆ తర్వాత ఆమెకు డెలివరీ ఎక్కడ చేయించారు.. ఆ పుట్టిన బిడ్డకు తలనీలాలు తిరుపతిలో ఒళ్ళో కూర్చోబెట్టుకొని ద్వారంపూడి చేయించడం లాంటి ఆరోపణలు బోలిశెట్టి చేస్తున్నారు. అయితే గత సంవత్సరం నుండి ఆమెకు విపరీతంగా బెదిరింపుకు గురి అవుతున్నట్లు కూడా ఆయన అన్నారు. ఎందుకంటే తన లైఫ్ తనకు ఉండాలని.. నువ్వు భార్యగా ఉండడం ఇష్టం లేదని.. ద్వారంపూడి ఆమెను హౌస్ అరెస్ట్ చేసినట్లుగా చెబుతున్నారు. ఇంటి బయట 28 కెమెరాలను పెట్టి ఆమెను ఇంట్లోంచి బయటికి రానివ్వకుండా గృహ నిర్భంధం చేయడం.. అలాగే కార్ లోనే డివైస్ లు పెట్టి మహిళ ఎక్కడికి వెళ్తుందో ట్రాక్ చేయడం చేస్తున్నారని బోలిశెట్టి సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు చేశారు.
ఇవి ఇప్పుడు దుమారం లేపుతున్నాయి. ఒక మహిళ తన హక్కు గురించి తన బిడ్డ భవిష్యత్తు గురించి బాధపడుతుంది కాబట్టి ఇది నేను పొలిటికల్ గా తీసుకోలేదని కేవలం మహిళ తరపున మాత్రమే మాట్లాడుతున్నానని అన్నారు. ఆమెకు జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని మీడియాకు తెలిపారు. ఇలా మొత్తానికి ప్రస్తుతం ద్వారంపూడిపై జనసేన నేత బోలిశెట్టి సత్యనారాయణ చేస్తున్న ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దాంట్లో భాగంగానే బోలిశెట్టి నిన్న ఈ వీడియో విడుదల చేసి ద్వారంపూడి గుట్టు రట్టు చేసినట్లు అయింది.











