అక్రమాస్తులు,మనీ లాండరింగ్,క్విడ్ ప్రో కో తదితర ఆరోపణలతో సీబీఐ,ఈడీ కేసుల్లో బెయిల్ రద్దు చేయాలనే పిటిషన్ జూన్ 1న విచారణకు రానుంది.ఈ మొత్తం17ఛార్జి షీట్లు దాఖలయ్యాయి.ఈ కేసుల్లో విచారణలు ఎదుర్కొని 16 నెలలు జైల్లో ఉండి బెయిల్‌పై విడుదలైన వైఎస్ జగన్ 2019లో జరిగిన ఎన్నికల్లో సీఎం అయ్యారు.అప్పటి నుంచి పలు కారణాలు చూపుతూ విచారణకు హాజరు కావడం లేదని,సాక్షులను ప్రభావితం చేసే పరిస్థితి ఉందన్నపలు కారణాలు చూపుతూ బెయిల్‌ను రద్ద చేయాలని పటిషన్ దాఖలైంది.దీనిపై పలుమార్లు విచారణ జరిగింది.జూన్ 1న మరోసారి విచారణ జరగనుంది.ఈ నేపథ్యంలో సీబీఐ,ఈడీ మరోసారి జగన్‌కు షాక్ ఇచ్చింది.తాజాగా మరో కేసులో గృహ నిర్మాణ ప్రాజెక్టులకు సంబంధించి మరో ఛార్జి షీటును దాఖలు చేసింది.ఇప్పటి వరకు సీబీఐ తరఫున 11 ఛార్జి షీట్లు,ఈడీ తరఫున 6 ఛార్జిషీట్లు ఉన్నాయి.గృహ నిర్మాణ ప్రాజెక్టులకు సంబంధించి ఈడీ కొత్త ఛార్జిషీట్ దాఖలు చేయడంతో జగన్ పై ఈడీ దాఖలు చేసిన ఛార్జిసీట్ల సంఖ్య 7కి చేరింది.మొత్తం మీద చార్జిషీట్ల సంఖ్య 18కి చేరింది.ఈ మేరకు ప్రధాన పత్రికలో వార్తలు వచ్చాయి.కొత్త చార్జిషీట్‌పై విచారణను న్యాయస్థానం జూన్ 30కి వాయిదా వేసింది.అంటే బెయిల్ రద్దు చేయాలనే పిటిషన్ జూన్ 1న విచారణకు వస్తుండగా జూన్ 30న మరో కేసు విచారణ జరుగుతుందని చెప్పవచ్చు.
వీరి పేర్లు చేర్చి..
గృహ నిర్మాణ ప్రాజెక్టులు,ఆర్థిక లావాదేవీల విషయంలో ఈడీ దాఖలు చేసిన అభియోగ పత్రంలో వైఎస్ జగన్,తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి,మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్,ఇందూ గ్రూపు వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ రెడ్డిల పేర్లు ఉన్నాయి.కాగా గతంలోనే ఈ ఛార్జిషీట్ దాఖలు చేసినా కొన్ని లోపాలు ఉండడంతో ఈ చార్జిషీట్ లోపభూయిష్టంగా ఉందని న్యాయస్థానం అభ్యంతరం చెప్పడంతో మరోసారి చార్జిషీట్ దాఖలైంది. పైన పేర్కొన్న పేర్లతో పాటు బెంగళూరు రియల్టర్ జితేంద్ర వీర్వానీ,ఇందూ ప్రాజెక్ట్స్,సైబరాబాద్ హైటెక్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ డెవలప్మెంట్ కార్పొరేషన్,ఇందూ ఈస్టర్న్ ప్రావిన్స్ ప్రాజెక్ట్స్,ఇందూ రాయల్ హోమ్స్,వసంత ప్రాజెక్ట్స్,ఎంబసీ ప్రాపర్టీ డెవలప్మెంట్స్ సంస్థలను ఈడీ నిందితుల జాబితాలో చేర్చింది.కాగా ఈ కేసుకు సంబంధించి మొత్తం 14 మంది నిందితులని సీబీఐ అభియోగం మోపగా విచారణ అనంతరం11 మంది నిందితులుగా తేలినట్లు ఈడీ అభియోగపత్రంలో పేర్కొంది.వైసీపీ కీలక నేత,రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేరుతో పాటు కొన్ని పేర్లను ఈడీ తొలగించింది. జగన్‌కు చెందిన కార్మెల్ ఏషియా,ఐఏఎస్ అధికారి ఎస్.ఎన్.మహంతి పేర్లు ఈ ఛార్జిషీట్‌లో లేవు.
జరిగింది ఇదీ..
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఏపీ హౌసింగ్ బోర్డు గృహ నిర్మాణ ప్రాజెక్టుల విషయంలో ఇందూ గ్రూప్ అధినేత శ్యాంప్రసాద్‌రెడ్డి అనుచిత లబ్ధి పొందినట్టు ఆరోపణలు వచ్చాయి.హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రాంతంలో 65, గచ్చిబౌలిలో 21, బండ్లగూడలో 50, నంద్యాలలో 75 ఎకరాల చొప్పున అతి తక్కువ ధరలకు కేటాయించినట్లు దర్యాప్తు సంస్థలు తేల్చాయి.అలా లబ్ధి పొందినందుకు గాను ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డి రూ.70 కోట్లను జగన్ కంపెనీల్లోకి పెట్టుబడులుగా ఇచ్చారని అభియోగం నమోదైంది.ఈ వ్యవహారాల్లో బెంగళూరుకు చెందిన ఎంబసీ ప్రాపర్టీ డెవలప్మెంట్స్ అధినేత జితేంద్రవీర్వానీతో పాటు పలువురి హస్తం ఉందని తేల్చింది.ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించడంతో పాటు మనీ లాండరింగ్ ఆరోపణలు చేసింది.కాగా ఇప్పటికే ఈ ఆరోపణలకు సంబంధించి వివిధ కంపెనీలకు చెందిన రూ. 117 కోట్ల విలువైన ఆస్తులను 2018లో ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే.ఇటీవల దాఖలు చేసిన అభియోగపత్రంపై జూన్ 30న విచారణ జరగనుంది.