తెలుగుదేశం పార్టీ యువనాయకుడు చింతకాయల విజయ్, సొంత పార్టీ కార్యకర్తలని దుర్భాషలాడారంటూ ఓ నీలి వెబ్ సైట్ ఓ వార్త ప్రచురించింది. విజయ్ మాట్లాడిన వీడియో ఎన్నిసార్లు చూసినా ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేంటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇంతకీ విషయం ఏమిటంటే..
కాకినాడ జిల్లా అల్లిపూడి గ్రామంలో TDP నాయకుడు బంగారయ్య ను వైకాపా గూండాలు దారుణంగా హ*త్య చేసారు. ఆయన కుటుంబాన్ని చ విజయ్ పరామర్శించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో విజయ్ మాట్లాడుతూ, వైకాపా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనల్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిందో గుర్తు చేసుకోండి, మనమీద ఎన్ని కేసులు పెట్టిందో గుర్తుచేసుకోండి, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాగాని మన నాయకుడిని హ*త్య చేసింది. కాబట్టి, తెలుగుదేశం కార్యకర్తలు ఎటువంటిపరిస్థితుల్లో కూడా వైకాపా నాయకులతో సంబంధాలు పెట్టుకోవద్దు. గతంలో అంటే ఇంత కక్షసాధింపు రాజకీయాలు లేవు, ఇప్పుడు వైకాపా వాళ్ళతో సంబంధం పెట్టుకోవడం చాలా దారుణం. ఒక గ్రామ పంచాయితీలో గెలుపుకోసమో, తాత్కాలిక బెనిఫిట్ కోసమో వైకాపా నాయకులతో సంబంధాలు పెట్టుకుంటే నేను ఊరుకోను. అలాంటి వాళ్ళు ఇంట్లో కూర్చోండి. నేను పార్టీని మరీ ఎమోషనల్ గా తీసుకుంటున్నాను అంటున్నారు, నేనేకాదు, లోకేష్ గారు కూడా పార్టీని ఎమోషనల్ గానే తీసుకుంటున్నారు. పార్టీ మీద ఎమోషన్ లేకపోతే రాజకీయాలు చేయలేము అని విజయ్ అన్నారు. ఇంతమంచి మెసేజ్ ఇచ్చిన విజయ్ ని కించపరచాలని నీలి వెబ్ సైట్ ప్రయత్నించడం చూస్తుంటే, సైకో పార్టీకి విజయ్ సెగ గట్టిగానే తగిలినట్లుంది.











