‘చూడు చూడు నల్లగొండ… గుండె మీద ఫ్లోరైడ్ బండ.. బొక్కలొంకరుబోయిన బతుకులా.. మన నల్లగొండ.. దుఃఖమెల్లాదీసేదెన్నాళ్లు… ఈ పాట వింటుంటే నల్లగొండ బారిన ఫ్లోరైడ్ పరిస్థితులు కళ్ల ముందు కదలాడుతున్నాయి కదా. ఈ పాట రాసింది ఏ సినిమా రైటరో కానే కాదు. సాక్షాత్తూ తెలంగాణ ముఖ్యమంతి కేసీఆర్ రాశారు. కేసీఆర్ రాసిన పాటను ఆర్థిక మంత్రి హరీశ్ రావు పాడి అసెంబ్లీలో వినిపించారు.
2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్ రావు వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన ఈ పాట పాడారు. ఇది నల్లగొండ తాగునీటి కష్టాలను చూసి చలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రాసిన పాటని చెప్పారు. త్వరలోనే రాష్ర్టంలో ప్రతి ఇంటికి సురక్షిత జలాలు అందుతాయని హరీశ్ అన్నారు.
Also Read :చరిత్రలో ఎన్నడూ లేదు.. హరీశ్‌కు ఎంత కష్టం వచ్చిందో?