నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ , ప్రియదర్శి నటించిన కామెడీ ఎంటర్ టైనర్ జాతిరత్నాలు. అనుదీప్ కెవీ మలిచిన ఈ సినిమా సూపర్ హిట్టై.. భారీ కలెక్షన్స్ తెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమా యూనిట్ తిరుమలకు పయనమై.. శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం హీరో నవీన్ పోలిశెట్టి, హీరోయిన్ ఫరియా అబ్దాల్లా ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
శ్రీవారి దర్శనానంతరం తీర్ధ ప్రసాదాలు స్వీకరించిన చిత్ర యూనిట్ .. ఫోటోలకు పోజులిచ్చారు. హీరో నవీన్ పొలిశెట్టి, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, సినిమా పీఆర్వోలు వంశీ, శేఖర్ తదితరులు ఈ ఫోటోల్లో రివీలయ్యారు. స్వప్నా సినిమాస్ బ్యానర్ పై దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించిన ‘జాతిరత్నాలు’ సినిమా .. ప్రస్తుతం ట్రెండింగ్ గా మారింది. ఈ సినిమా సూపర్ హిట్ తో నవీన్ పొలిశెట్టి.. పెద్ద పెద్ద సంస్థల నుంచి ఆఫర్స్ అందుకుంటున్నాడు.
Also Read: ‘జాతిరత్నాలు’ దర్శకుడితో ఎనర్జిటిక్ స్టార్ ?
గోవిందా.. గోవింద. 🙏
తిరుమల వెంకటేశ్వరుని సన్నిధి లో జాతిరత్నాలు ✨@NaveenPolishety @fariaabdullah2 #AnudeepKV @priyadarshi_i @eyrahul @vennelakishore @actorbrahmaji #Radhan #PriyankaDutt @nagashwin7 @SwapnaCinema @LahariMusic #JathiRatnalu pic.twitter.com/6EyejAKAhf— BA Raju's Team (@baraju_SuperHit) March 18, 2021
జాతిరత్నాలు











