పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మొత్తం 10 ఫైరింజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయినా మంటలు అదుపులోకి రావడం లేదు. పుణెలోని మంజ్రీ ప్రాంతంలో గల సీరమ్ ప్లాంట్ టర్మినల్ -1 గేట్ వద్ద..
కరోనా వ్యాధి నివారణకు కీలకమైన కోవిషీల్డ్ వేక్సిన్ ను సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రాజెనికా వారి సంయుక్త భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన వేక్సిన్ ను భారత్ లో సీరం తయారుచేస్తోంది. భారత్ బయోటెక్ వారి కోవాగ్జిన్‌తో పాటు, సీరం వారి కోవిషీల్డ్ కు కూడా ప్రభుత్వ అనుమతులు లభించాయి. ప్రస్తుతానికి దేశంలో ఈ రెండింటితో వేక్సినేషన్ జరుగుతోంది.
ఇలాంటి కీలక సమయంలో పుణెలోని సీరం సంస్థలో అగ్నిప్రమాదం జరగడంతో పలువురిలో కలవరం వ్యక్తం అవుతోంది. దీనికి సంబంధించిన కారణాలు ఇంకా తెలియలేదు.