మెగాస్టార్ చిరంజీవి – బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న భారీ చిత్రం ‘ఆచార్య’. ఇటీవల ఈ సినిమా షూట్ లో చరణ్ ఎంటర్ అయ్యారు. ఇందులో చరణ్ సిద్ధా అనే పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఈ మూవీ టీజర్ రిలీజ్ కి ముహుర్తం ఫిక్స్ అయ్యింది అంటూ వార్తలు వస్తున్నాయి.
ఇంతకీ ఎప్పుడంటే.. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ‘ఆచార్య’ మూవీ టీజర్ రిలీజ్ చేయనన్నట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. త్వరలోనే టీజర్ రిలీజ్ డేట్ ను అఫిషియల్ గా ఎనౌన్స్ చేయనున్నారని అంటున్నారు. అయితే.. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ‘ఆర్.ఆర్.ఆర్’ టీజర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ టీజర్, చరణ్ టీజర్ రిలీజ్ చేసిన ‘ఆర్.ఆర్.ఆర్’ టీమ్ ఇప్పుడు వీరిద్దరూ ఉండే టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.
అయితే.. ఆర్.ఆర్ఆర్. టీజర్ రిలీజ్ చేస్తున్న రోజునే ‘ఆచార్య’ టీజర్ రిలీజ్ చేయనున్నారు అనేది ఆసక్తిగా మారింది. ఈ రెండు సినిమాలకు సంబంధించిన టీజర్స్ జనవరి 26న రానున్నాయి అని గట్టిగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆర్ఆర్ఆర్, ఆచార్య టీజర్స్ పై మరింత ఆసక్తి ఏర్పడింది. మరి.. ప్రచారంలో ఉన్నట్టుగా ఆచార్య టీజర్ ను 26న రిలీజ్ చేస్తారా.? లేదా..? అనేది చూడాలి.