‘నషా’ చిత్రంతో బాలీవుడ్ స్ర్కీన్ పై పేలిన హాట్ బాంబ్ పూనమ్ పాండే గుర్తుంది కదా. అమ్మడు ఇండియాలో పుట్టబట్టి సరిపోయింది. లేకపోతే.. ఏ ఫారెన్ కంట్రీస్ లోనో పుట్టి ఉంటే.. ఆమెకు అసలు బట్టల ఖర్చే ఉండేది కాదేమో. ఎందుకంటే.. ఆమె బట్టల్ని ఒంటికి తగిలించుకోవడం కన్నా ఏ హుక్ కో తగిలించడం బెస్ట్ అని అనుకుంటుంది కాబట్టి. ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా పేజ్ లో హాట్ నెస్ ఒలికించే పోజులతో నెటిజెన్స్ ఫ్యూజులెగరకొడుతూ ఉంటుంది చిన్నది. అలాంటి ఈ హాటీకి గోవా పోలీసులు షాకిచ్చారు.
గోవాలో పూనమ్ పాండే పై కేసు నమోదయింది. గోవాలోని కనకోవా పోలీస్టేషన్ లో కేసు ఫైలైంది. నిబంధనలకు విరుద్ధంగా గోవాలో ప్రవర్తించడం వల్లనే గోవా పోలీసులు ఆమెపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. చపోలీ డ్యామ్ వద్ద ఒక వ్యక్తి తీస్తున్న వీడియోలో పూనమ్ అభ్యంతరకర రీతిలో పోజులు పెట్టిందట. అతడ్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. గోవా ఫార్వర్డ్ పార్టీ మహిళా విభాగం పూనమ్ పై కేసు పెట్టింది. ఆమె ఇలా చేయడం చపోలీ డ్యామ్ పవిత్రతను గోవా సంస్కృతిని నాశనం చేయడమే అని పేర్కొన్నారు. ఈ మే నెల్లో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ముంబై పోలీసులు కూడా ఆమెపై కేసు ఫైల్ చేశారు.










