గత నాలుగు దశాబ్దాలుగా అనంతపురం రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన జేసీ కుటుంబం ఇప్పుడు ఎందుకు ఇబ్బందులు ఎదుర్కొంటోంది? రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి రాకముందు చంద్రబాబు అధికారంలో వున్నప్పుడు కూడా జైలు ఊచలు లెక్కించని జేసీ ఫ్యామిలీ ఇప్పుడు ఎందుకు జైలు పాలైంది..? వీటన్నింటికీ సమాధానం కావాలంటే… వై.ఎస్.. ఫ్యామిలీకి, జేసీ కుంటుంబానికి ఉన్న పూర్వం వైరాన్ని ఓసారి తెలుసుకోవాలి..
అనంతపురం-కడప సరిహద్దుల్లో ఉన్న మంగంపేట బైరటీస్ గనుల విషయంలో వై.ఎస్.రాజారెడ్డి హాయామం నుంచే జేసీ ఫ్యామిలీతో గొడవలున్నాయి. అందుకే 1994లో రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి రాగానే జేసీని అణగదొక్కడానికి వై.ఎస్ రాజారెడ్డి ఏకంగా పరిటాల రవి ఇంటికే వెళ్లి మంతనాలు జరిపాడనే టాక్ అప్పట్లో వినిపించింది. అంతకు ముందు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉండగా మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి లకు సన్నిహితంగా జేసీ కుటుంబం మెలిగింది. వై.ఎస్. కుటుంబం మాత్రం వారికి వ్యతిరేకంగా రాజకీయం చేస్తూ వచ్చింది. ఇలా వై.ఎస్., జేసీ కుటుంబాల మధ్య దశాబ్దాలుగా వైరం కొనసాగింది. 1995-2004 వరకు చంద్రబాబు అధికారంలో వున్నప్పుడు కూడా జేసీ కుటుంబం చంద్రబాబుతో తెరవెనుక సఖ్యను నడిపిందనే ప్రచారం ఉంది. అందుకు కారణం పరిటాల రవిని వై.ఎస్.రాజారెడ్డి కలవడమే అని చెబుతుంటారు జిల్లావాసులు. అయితే 2004లో వై.ఎస్.అధికారంలోకి రావడానికి జేసీ కుటుంబంతో కాస్త రాజీపడి.. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేశారు. అందుకే వై.ఎస్. ముఖ్యమంత్రి అయిన వెంటనే తన క్యాబినెట్లోకి జేసీ దివాకరరెడ్డి ని తీసుకుని ఏకంగా పంచాయతీ రాజ్ శాఖను ఇచ్చాడు. అయితే వై.ఎస్.అత్యంత ఆప్తమిత్రుడు మాజీ ఎమ్మెల్యే తిమ్మపల్లి సూర్యుడిని జేసీ వర్గీయులు అత్యంత పాశవికంగా చంపడంతో వై.ఎస్. జేసీ కుటుంబాన్ని కొంత దూరంగా ఉంచడం ప్రారంభించాడు. ఇందులో భాగంగానే రెండోసారి వై.ఎస్. ముఖ్యమంత్రి అయిన తర్వాత జేసీని క్యాబినెట్ లోకి తీసుకోకుండా ఝలక్ ఇచ్చారు. ఆ తరువాత వై.ఎస్. మరణించడం.., జగన్ పార్టీ పెట్టడం, రాష్ట్ర విభజన జరగడం.. కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో ఆదరణ లేదని జేసీ కుటుంబం మొదట వైసీపీలోకి వెళ్లడానికి ప్రయత్నించి విఫలమవ్వడం.. ఆ తరువాత ఎన్నికల సమయంలో టీడీపీలోకి జేసీ కుటుంబం రావడం అన్నీ చక చక సాగిపోయాయి. 2014-2019 మధ్య టీడీపీ అధికారంలో వున్నప్పుడు పలు మీటింగ్ లో జేసీ దివాకర్ రెడ్డి జగన్ ను తీవ్ర పదజాలంతో విమర్శించాడు. అంతే కాదు జేసీ ట్రావెల్స్ యాక్సిడెంట్ కి గురై ప్రయాణీకులు మరణిస్తే.. వాళ్ళను పరామర్శించడానికి వెళ్లిన వై.ఎస్ జగన్… జేసీ ట్రావెల్స్ పై తీవ్ర విమర్శలు చేసారు. అందుకు ప్రతిగా జేసీ.ప్రభాకర్ రెడ్డి ఏకంగా అనంతపురంలో సాక్షి కార్యాలయం ముందు టెంట్ వేసి.. వై.ఎస్.జగన్ అండ్ ఫ్యామిలీని అమ్మనాబుతులు తిట్టి విమర్శలు ఎదుర్కొన్నాడు. అలా జేసీ, వై.ఎస్. కుటుంబం మధ్య నాటి వై.ఎస్.జగన్ తాత వై.ఎస్.రాజారెడ్డి నుంచి జేసీ కుటుంబంతో వైరం కొనసాగుతూనే వస్తోంది. దాన్ని వై.ఎస్. జగన్ ఇప్పుడు కొనసాగిస్తున్నాడు. మొన్న అధికారంలోకి రాగానే జేసీకి చెందిన ట్రావెల్స్ మొత్తాన్ని సీజ్ చేసి.. ఆర్థికంగా దెబ్బకొట్టాడు. ఇప్పుడు అక్రమ వాహనాల రిజిస్ట్రేషన్ కేసులో ఇరికించి తన పగను మరింత తీవ్ర తరం చేసాడు జగన్. జైలు నుంచి విడుదల కాగానే సి.ఐ.ని దూషించిన కేసులో ఏకంగా అట్రాసిటీ కేసు పెట్టి మళ్లీ జైలుకు పంపాడు. ఇలా జేసీ కుంటుంబానికి… వై.ఎస్.జగన్ కి మధ్య వైరం పతాక స్థాయికి చేరుకుంది.
మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..
యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...










