బిగ్ బాస్ 4 గ్రాండ్ ఫినాలే సందడి మామూలుగా లేదు. ఈ షోలో పాలొన్న పోటీదారులంతా దీనికి హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవితో మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు. సోషల్ మీడియా స్టార్ మెహబూబ్ కు చిరంజీవి ఆర్థిక సహాయం ప్రకటించడం విశేషం. సోహైల్ అందుకున్న 25 లక్షల్లో అనాథాశ్రమానికి రూ. 5 మెహబూబ్ ఇంటికి రూ. 5 లక్షలు ఇస్తానన్నాడు. దాన్ని మెహబూబ్ అంగీకరించలేదు. తనకు ఇవ్వాలనుకుంటున్న సాయాన్ని కూడా అనాథాశ్రమానికే ఇవ్వమని కోరాడు.
అయితే సోహెల్ దానంగా ఇవ్వాలనుకుంటున్న మొత్తాన్ని తనే ఇస్తానని నాగార్జున ప్రకటించారు. దానికి చిరంజీవి కూడా స్పందించారు. మెహబూబ్ ఇంటి కోసం అయ్యే ఖర్చు తను ఇస్తానని అక్కడికక్కడే రూ. 10 లక్షల చెక్కు రాసి ఇచ్చారు. హీరోయిన్లు ప్రణీత, లక్ష్మీరాయ్, మెహ్రీన్, దర్శకుడు అనిల్ రావిపూడి ఈ గ్రాండ్ ఫినాలే లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంగీత దర్శకుడు తమన్ తన సంగీత విభావరితో అలరించారు. బిగ్ బాస్ సీజన్–3కు 8 కోట్ల మంది ఓట్లు వేశారు. ఈ 4వ సీజన్‌కు 15.65 లక్షల ఓట్లు వచ్చాయని నాగార్జున వివరించారు.
బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే మెరుపులు
* మెగాస్టార్ చిరంజీవి మాటలు, పంచ్ డైలాగులు ప్రధాన ఆకర్షణ. మెహబూబ్ ను చూస్తుంటే చిన్నప్పుడు తనను తాను చూసుకున్నట్టుందన్నారు చిరంజీవి.
* సోహైల్ కు ఏం కావాలో కోరుకోమంటూ చిరంజీవి వరం ఇచ్చారు. దానికి సోహైల్ తను తీయబోయే సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు రావాలని ఆహ్వానించాడు. దాంతో చిరు ఏకంగా అతడు తీయబోయే సినిమాలోనే నటిస్తానని హామీ ఇచ్చారు.
* దివికి తన తదుపరి సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర ఇస్తున్నట్లు చిరు ప్రకటించారు.
* మెగాస్టార్ రూ. 10 లక్షల చెక్కు ఇవ్వగానే మెహబూబ్ ఉద్వేగానికి లోనై ఆయన కాళ్లమీద పడిపోయాడు. దాంతో చిరంజీవి అతడిని ఓదారుస్తూ కళాకారులు కన్నీళ్లు పెట్టకూడదంటూ హత్తుకున్నారు.
* హౌస్ మేట్స్ తో డీల్ మాట్లాడటానికి ప్రణీత మధ్యవర్తిగా వ్యవహరించారు. ఐదుగురిలో మొదట ఎలిమేనేట్ అయ్యింది హారిక. పది లక్షలకు డీల్ మాట్లాడినా వారు ఒప్పుకోలేదు.
* అరియానా ఎలిమినేషన్ ప్రకటించగానే ఆమె ఒకింత షాక్ కు గురైంది. ప్రేక్షకుల ప్రేమ దొరికినందుకు ఆనందంగా ఉందని, దాంతోనే సరిపెట్టుకుంటానంది.
* ఎలిమినేట్ అయినవారిని బయటకు తీసుకొచ్చే బాధ్యతను నాగ్ అనిల్ రావిపుడికి అప్పగించారు. తాను నవ్విస్తానే కానీ ఆ పనిచేయలేనని అనిల్ రావిపూడి అన్నారు. చివరికి ఆ బాధ్యత మెహ్రీన్ కు చేరింది.
* అనిల్ రావిపూడితో నాగ్ టాస్క్ లు ఆడించారు.
Must Read ;- నాగార్జున ఉరుకులు, పరుగులు











