మహబూబాబాద్ పట్టణానికి చెందిన బోనగిరి శేఖర్ మెగాస్టార్ వీరాభిమాని. 30 ఏళ్లుగా రాష్ట్రస్థాయి చిరంజీవి సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ..వాటిని విజయవంతం చేయడంలో కీలకంగా పనిచేస్తుంటారు. వాస్తవానికి శేఖర్ చాలా పేద కుటుంబానికి చెందిన వ్యక్తి. తన జీవనాన్ని మిర్చి బండితో సాగిస్తున్నాడు. ఆయనకు వర్ష, నిఖిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వాళ్ళ పెద్దమ్మాయి వర్ష పెళ్లి డిసెంబర్ 19 న జరగనుంది. ఈ నేపథ్యంలో శేఖర్ పేదరికాన్ని స్వయంగా తెలుసుకున్న చిరంజీవి లక్ష రూపాయల ఆర్ధిక సాయాన్ని పెళ్లి నిమిత్తం అందించారు.
ఈ విషయంపై స్థానిక శాసన సభ్యుడు శంకర్ నాయక్ స్పందిస్తూ, చిరంజీవి గారు లక్ష రూపాయల సాయాన్ని ఆ కుటుంబానికి అందించడం సంతోషదాయకమని అన్నారు. చిరంజీవి బ్లడ్, ఐ బ్యాంక్ సి.ఇ.ఓ. రవణం స్వామినాయుడు మాట్లాడుతూ, అభిమానుల కష్టాలను తీర్చే గొప్ప గుణం చిరంజీవిది అని అన్నారు. అభిమాని శేఖర్ మాట్లాడుతు, “ఏమిచ్చినా చిరంజీవి గారి ఈ రుణం తీర్చుకోలేనిదని కన్నీళ్ల పర్యంతమయ్యారు .ఈ కార్యక్రమంలో ,సంతోషం పత్రిక అధిపతి సురేశ్ కొండేటి, స్ధానిక మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు కె. ప్రభాకర్ గౌడ్, వైస్ చైర్మన్ ఫరీద్, మహబూబాబాద్ చిరంజీవి యువత అధ్యక్షులు మునిర్, స్థానిక చిరంజీవి అభిమాన సంఘం నాయకులు పెద్ద ఎతున్న తదితరులు పాల్గొన్నారు.
Must Read ;- జర్నలిస్ట్ రామ్మోహన్ నాయుడిని పరామర్శించిన మెగాస్టార్