టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం ‘బిగ్ బాస్ 4’ హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. రోజురోజుకు విశేషాదరణతో దూసుకెళుతున్న ‘బిగ్ బాస్ 4’ ఎండింగ్ కి వచ్చేసింది. ఈ సంవత్సరంలో బిగ్ బాస్ 4తో పాటు వైల్డ్ డాగ్ మూవీ షూటింగ్ ని కంప్లీట్ చేశారు. అయితే.. 2021లో నాగ్ పక్కా ప్లాన్ రెడీ చేశారని తెలిసింది. గరుడవేగ సినిమాతో సక్సస్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించిన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్టు ఆమధ్య అఫిషియల్ గా ఎనౌన్స్ చేశారు. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ కానుంది అనేది ఇంకా ఎనౌన్స్ చేయలేదు.

Must Read ;- బిగ్ బాస్ 4 ఫైనల్ ఎపిసోడ్ కు ఈ స్టార్ హీరో వస్తాడా?
అలాగే ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ప్రీక్వెల్ బంగార్రాజు సినిమా గురించి కూడా వార్తలు వస్తున్నాయి కానీ.. ఇప్పటి వరకు అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రాలేదు. అనూప్ రూబెన్స్ తో పాటల రికార్డింగ్ కూడా చేసారు. కథను లాక్ చేసారని కూడా టాక్ వినిపించింది. ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మించనున్నారు. ఇదిలా ఉంటే.. ‘మన్మథుడు 2’ సినిమా అనుభవంతో రొమాంటిక్ మూవీస్ చేయకూడదని ఫిక్స్ అయ్యారట. ఇక నుంచి యాక్షన్ మూవీస్ అండ్ ఫ్యామిలీ మూవీస్ మాత్రమే చేయాలి అనుకుంటున్నారట నాగ్.
‘బిగ్ బాస్ 4’ కంప్లీట్ అవుతుండడంతో తను చేయబోయే సినిమాల పైనే ఫోకస్ పెట్టారట. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. త్వరలోనే అఫిషియల్ గా ఎనౌన్స్ చేయనున్నారు. ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ తో కథాచర్చలు జరుపుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఆ ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. మరి.. సరైన సక్సస్ కోసం ఎదురు చూస్తున్ననాగార్జున 2021లో వరుస విజయాలు సాధిస్తారేమో చూడాలి.
Also Read ;- ఆపిల్ ఇండియా స్టోర్ లో ఫోన్లు కొనొద్దు: నాగార్జున సలహా











