బిగ్ బాస్ 4లో ఎలిమినేషన్ ప్రక్రియ ఊహించినట్లుగానే జరిగింది. ఈ వారం మెహబూబ్ ఎలిమినేట్ కావచ్చని లియో న్యూస్ ముందే ఊహించింది. బిగ్ బాస్ టాస్క్ లు ఇవ్వడం, హౌస్ మేట్స్ మధ్య గొడవలు జరగడం షరామామూలే. వారి మధ్య ప్రేమ వ్యవహారాలు కూడా షో మీద ఆసక్తిని పెంచుతోంది.ఈ 10వ వారంలోకి షో ఎంటరైంది. ప్రేక్షకుల ఓటింగ్ సరళిని బట్టే ఎలిమినేషన్ ఉంటుందని పోయిన వారమే నాగార్జున చెప్పారు.
షో ను మొదట్నుంచీ గమనించే వారికి మెహబూబ్ ఎలిమినేషన్ తప్పదని అర్థమైపోయింది. మెహబూబ్ గురించి చెప్పాల్సి వస్తే యూట్యూబ్‌లో అతను డ్యాన్స్ వీడియోలతో పాపులర్ అయ్యాడు. ఈ రోజు ఎలిమినేషన్ నుంచి తప్పించుకోడానికి అతను చేైసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఒక విధంగా చెప్పాలంటే అతని దూకుడే అతను ఎలిమినేట్ అయ్యేలా చేసిందని అనుకోవచ్చు.