Hits Of Akkineni Young Heros
యువ సమ్రాట్ నాగచైతన్య, ఫిదా బ్యూటీ సాయిపల్లవి నటించిన తాజా చిత్రం లవ్ స్టోరీ. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన లవ్ స్టోరీ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణతో బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్లింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్ సీస్ లో సైతం రికార్డు కలెక్షన్స్ వసూలు చేసింది. ఇంకా చెప్పాలంటే.. నాగచైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సెకండవ్ వేవ్ తర్వాత రిలీజైన ఈ పెద్ద సినిమాకి ఎలాంటి ఆదరణ లభిస్తుందో అనుకున్నారు కానీ.. అంచనాలకు మించిన సక్సస్ ను లవ్ స్టోరీ సాధించింది. దీంతో మరిన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర క్యూకట్టాయి.
ఇక నాగచైతన్య తర్వాత అఖిల్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 15న రిలీజ్ చేశారు. బొమ్మరిల్లు భాస్కర్ దీనికి దర్శకుడు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ చిత్రానికి సమర్పకుడు కాగా బన్నీ వాసు, వాసు వర్మ నిర్మాతలు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాకి కూడా అంచనాలకు మించిన కలెక్షన్స్ వస్తుండడం విశేషం. అఖిల్, పూజా హేగ్డే నటన, గోపీ సుందర్ సంగీతం, బొమ్మరిల్లు భాస్కర్ టేకింగ్ అన్నీ కలిసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీకి సక్సస్ ని అందించాయి.
Hits Of Akkineni Young Heros
ఇలా అక్కినేని బ్రదర్స్ నాగచైతన్య, అఖిల్ సక్సస్ సాధించడంతో నాగార్జున ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అయితే.. కొడుకులిద్దరూ సక్సస్ సాధించడంతో ఇప్పుడు నాగార్జున కూడా సక్సస్ సాధించాలనే పట్టుదలతో సినిమా చేస్తున్నారు. అదే.. బంగార్రాజు. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి ఇది ప్రీక్వెల్. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనేది నాగార్జున ప్లాన్. నాగ్ కూడా బంగార్రాజు మూవీతో సక్సస్ సాధిస్తే.. ఇక అక్కినేని అభిమానులకు పండగే పండగ.











