అధికారం చేతిలో ఉండటంతో అందిన కాడికి దోచుకుపోవడమే పనిగా ప్రభుత్వ పెద్దలు ముందుకు సాగుతున్నారు. మనవాడైతేనే చాలు పంచేయవడం ఏపీ ప్రభుత్వానికి అలవాటు గా మారిపోయింది .. మరి ఏకంగా మనదే అయితే ఎలా ఉంటుంది .. అది ఎలా ఉంటుందో గత నాలుగేళ్లలో సాక్షికి వచ్చిన యాడ్స్ ని చూస్తే అర్ధమైపోతుంది .. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సాక్షిగా అడ్డగోలుగా ప్రకటనలు ఇస్తున్నారు . వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఏడాదికే కరోనా వచ్చింది .. అప్పట్లో ప్రభుత్వం పేదలని ఆదుకోవడానికి నిధులు లేవని చెప్పుకొచ్చింది .. అప్పట్లో వైరస్ దెబ్బకు ఆదాయం లేక ఎన్నో పత్రికలు సమస్యలు ఎదుర్కొన్నాయి .. కానీ సాక్షి పత్రికకు మాత్రం దేశంలో ఇతర ఏ పత్రికకు లేనంత ఆదాయం వచ్చింది. జగన్ మొదటి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా 16 పేజీల వరకూ యాడ్స్. వాటిలో ఎనభై శాతం ఫుల్ పేజీ.. కలర్ యాడ్సే ఇచ్చారు . అప్పటి నుంచి ప్రతి సందర్భంలో సాక్షికి దోచిపెడుతూనే ఉన్నారు .
ప్రస్తుతం ఓ ఫుల్ పేజీ ప్రకటన వస్తే.. పత్రికలు సంతోషపడిపోయే పరిస్థితి. కానీ.. సాక్షికి మాత్రం… అలాంటి ఇబ్బందే లేదు.. పేజీలకు పేజీలు యాడ్స్. ప్రభుత్వంలోని అన్ని శాఖలతో పాటు… ప్రభుత్వం దగ్గర పదవులు పొందినవారు.. ప్రభుత్వం దగ్గర కాంట్రాక్టులు పొందినవారు.. పార్టీ నేతలు.. కార్యకర్తలు.. ఇలా తమ శక్తివంచన లేకుండా ప్రకటనలతో సాక్షికి ఆదాయాన్ని అందిసిన్హారు . ప్రభుత్వం కూడా.. ప్రకటన ఖర్చును భారీగా మోస్తోంది. అత్యధిక సర్క్యూలేషన్ ఉన్న పత్రికకు.. ఒక్క ఫుల్ పేజీ యాడ్ ఇచ్చి.. మిగతా అంతా.. సాక్షి పత్రికకే మళ్లించుకుంటున్నారు. ప్రజాధనం ఇలా ప్రకటనల రూపంలో పెద్ద ఎత్తున సాక్షి అకౌంట్‌కు చేరుతోందన్న విమర్శలు వస్తున్నాయి. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. సాక్షి ప్రతికలో ప్రకటనలు ఇచ్చి ప్రజా సొమ్మును వృథా చేస్తున్నారని ఎన్ని విమర్శలు వచ్చినా ప్రభుత్వ పెద్దలకి పట్టడం లేదు
ప్రభుత్వ ప్రకటనలు ఆయా పత్రికల రీడర్ షిప్ బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కువ సర్క్యూలేషన్ కలిగిన పేపర్లు ఎక్కువ ప్రకటనలు వస్తుంటాయి. ఆ ప్రకారం ఈనాడుకు ఎక్కువ ప్రకటనలు రావాలి. తెలుగులో అత్యధిక సర్క్యూలేషన్ కలిగిన పేపర్ ఈనాడు. ఆ తరువాతి స్థానంలో సాక్షి ఉంటుంది. ఈనాడు సర్క్యూలేషన్ సాక్షి సర్క్యూలేషన్ కంటే రెండింతల వరకూ ఉంటుంది. అయితే అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రికకి ప్రభుత్వ యాడ్స్ ఇచ్చింది తక్కువ . ఇదే సమయంలో సాక్షికి చేతికి ఎముక లేనట్టు రాష్ట్రప్రభుత్వం ప్రకటనలు ఇచ్చింది.. ఇది ప్రభుత్వం సొమ్ము దుర్వినియోగం, సొంతవారికి దోచిపెట్టడమే అవుతుందని పలువురు విమర్శలు చేస్తున్నారు.
ఇక గత ఏడాది ప్రతి వాలంటీర్‌కు నెలకు 200 ఇవ్వడానికి, ఆ డబ్బుతో దినపత్రికలు కొనడానికి ఉద్దేశించి ఉత్తర్వులు విడుదలయ్యాయి… అందులో సాక్షి అనే పేరు ఉండదు తప్ప, ఉత్తర్వుల్లో పేర్కొన్న అంశాలను బట్టి… సాక్షి పత్రిక కొనండి అని పరోక్షంగా చెప్పినట్టే… నెలకు 5.32 కోట్లు ఖర్చపెడుతున్నారు … 2.66 లక్షల మంది వాలంటీర్లు ఈ డబ్బును వినియోగించుకోవచ్చు అని గతంలోనే చెప్పారు … ప్రతి వాలెంటీర్ ఈ ఉత్తర్వులు పాటిస్తున్నారు … ఒక్క దెబ్బకు సాక్షి సర్క్యులేషన్ రెండున్నర లక్షల కాపీలు అమాంతంగా పెరిగిపోయాయి ..
2019 మేలో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కారు తొలి ఆరు నెలల్లోనే సాక్షికి 30 కోట్ల విలువైన ప్రకటనలు ఇచ్చింది. తర్వాతి ఏడాది నుంచి కరోనా విలయ తాండవం చేసి ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి తలకిందులైనప్పటికీ.. ఏడాదికి 100 కోట్ల చొప్పున సాక్షికి ప్రకటనలు ఇచ్చారని సమాచారం .. కేవలం ప్రభుత్వ పథకాల గురించే కాక పెట్రోలు రేట్లు పెరిగినపుడు, ఇంకేదైనా ప్రజల మీద భారం పడ్డపుడు.. ఉద్యోగులకు ఇబ్బంది కలిగించే నిర్ణయాలు తీసుకున్నపుడు వారికి వివరణ ఇస్తూ యాడ్స్ ఇవ్వడం.. ఒక పథకానికి సంబంధించి మూణ్నాలుగు విడతలుగా డబ్బులు వేస్తే.. ప్రతిసారీ దాని గురించి ఊదరగొడుతూ ప్రకటనలు ఇవ్వడం సర్కార్ చేస్తోంది .
ప్రభుత్వ ప్రకటన లేకుండా సాక్షి పత్రిక మార్కెట్లోకి రావడం అరుదుగా జరుగుతోంది. మెయిన్ పేజీకి ఇచ్చిన యాడ్స్ విలువ 400కోట్లు .. జిల్లాల స్థాయిలో ఇంకో వంద కోట్ల మేర యాడ్స్ ఇచ్చారని.. ఇలా మొత్తంగా ప్రజల సొమ్ము 500 కోట్లను సొంత పత్రికకు జగన్ కట్టబెట్టారని తెలుస్తుంది ..