తెలంగాణాలో ఇప్పుడు 1 ఎకరం అమ్మితే ఆ డబ్బుతో ఆంధ్రప్రదేశ్‌లో 100 ఎకరాలు కొనుక్కోవచ్చు అని కేసీఆర్ ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అమర్‌నాథ్ బదులిస్తూ “హైదరాబాద్‌లోని భూముల ధరలు తెలంగాణ మొత్తాన్ని ప్రతిబింబిస్తున్నాయని అనుకోవడం వెర్రితనం. వైజాగ్‌లోనూ రియల్ ఎస్టేట్ జోరు బాగానే ఉంది. వైజాగ్‌లో ఒక ఎకరం అమ్మితే తెలంగాణలో 150 ఎకరాలు కొనవచ్చు.
ఎన్నికలు సమీపిస్తున్నందున, మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇతర రాష్ట్రాల మనోభావాలను దెబ్బతీయకూడదు. మీరు వాస్తవికతకు దగ్గరగా ఉండాలి” అని అమర్‌నాథ్ అన్నారు. హైదరాబాద్ కంటే వైజాగ్‌లో భూముల ధరలు ఎక్కువగా ఉన్నాయని అమర్‌నాథ్ సూచించడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉంటె కోకాపేట్‌లోని నియోపోలిస్ లేఅవుట్ గురువారం నగరంలోని రియల్టీ మార్కెట్ యొక్క అస్థిరమైన నిష్పత్తులను ప్రతిబింబించింది, లేఅవుట్‌లోని ల్యాండ్ పార్శిళ్ల వేలం ద్వారా HMDA ₹3,320 కోట్ల భారీ మొత్తాన్ని సేకరించింది. రాజపుష్ప ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 3.6 ఎకరాల భూమికి ఎకరానికి ₹100.75 కోట్లు అత్యధిక ధర పలికింది. హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ చరిత్రలో ఇదొక రికార్డు. వేలంలో లభించిన సగటు ధర ఎకరాకు ₹73.23 కోట్లు కాగా, అత్యల్ప ధర ₹67.25కోట్లు
గతంలో వైసీపీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు మరోమారు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు గుడ్డు మంత్రి ఎక్కడ ల్యాండ్ ధర ఎక్కువో అని తెగ ట్రోల్ల్స్ చేస్తున్న గుడివాడ అమర్నాథ్ ని.. గుడ్డు మంత్రికి ఏమి తెలియదు, కామెడీగా మాట్లాడితే సరిపోదు అవగాహనా ఉండాలి అని ఎదవా చేస్తున్నారు..