క్రికెట్ స్టేడియం గురించి తలుచుకుంటేనే చాలు.. క్రికెట్ ప్రేమికుల హృదయాలు ఉప్పొంగిపోతాయి. పరుగుల వరద.. వికెట్ల హోరుతో మార్మోగె స్టేడియంలో కూర్చుని క్రికెట్ చూస్తే ఆ కిక్కెే వేరు. ఇక ఆ స్టేడియం అత్యంత సుందరమైనదైతే ఎలా ఉంటుంది? స్టేడియంలలో పెద్దవి, పొడవైనవి.. వాటి గురించి విన్నాం కానీ.. ఈ సుందరమైన స్టేడియం ఏంటి అనుకుంటున్నారా? అవునండి..! ఈ మాట అన్నది ఎవరో కాదు.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి). మరి ఆ సుందరమైన క్రికెట్ స్టేడియంని మనమూ చూద్దాం రండి..
🖼️ Show us a more picturesque sports venue than the Gwadar cricket stadium in Balochistan.
We'll wait…
📸 @falamb3 pic.twitter.com/lz6nUGr9HH
— ICC (@ICC) January 31, 2021
బెలుచిస్థాన్‌లో గ్వాదర్ స్టేడియంని నిర్మిస్తున్నారు. వాటికి సంబంధించిన ఫొటోలను ఐసిసి తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసి.. ‘బెలుచిస్థాన్‌లోని గ్వాదర్ స్టేడియం కంటే అందమైన క్రీడాకార మైదానం ఏదన్నా ఉందమో చూడాలి’? అంటూ స్టేడియం అందాలను ఒక్క ట్వీట్‌తో వర్ణించింది ఐసిసి. ఒకవైపు ఎత్తైన పర్వతం.. మరోపక్క నగరం.. ఇంకోవైపు ఖాళీ స్థలం.. వీటన్నింటి మధ్య నిర్మితమవుతున్న గ్వాదర్ స్టేడియం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. మరి పూర్తి అయ్యే దశకి ఇంకెన్ని హంగులు తనలో చేర్చుకుని.. మరెంత అందంగా మారుతుందో చూడాలి!
Must Read ;- క్రికెట్ ప్రేమికులకు చేదు వార్త.. భారత్-పాక్ సమరం అనుమానమే!











