వైసీపీ దౌర్జన్యాలు అడ్డుఅదుపులేకుండా పోతుందని ప్రజలు వాపోతున్నారు. కోర్టులు ఎన్ని మొట్టికాయలు వేసినా సరే వారిలో మార్పు రావడం లేదంటూ ప్రజలు గగ్గోలుపెడుతున్నారు. అధికారం కట్టబెట్టిన ప్రజలనే పలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రజలు తమ బాధలును చెప్పుకొస్తున్నారు. అదుపు చేయాల్సిన రాజుగారే మౌనం వహించడం వల్లే ఇలాంటి అరాచకాలను అడ్డు లేకుండా పోతుందని తెలిసిన విషయమే.
దూషణలు.. దాడులు..
తాజాగా అనంతపురం జిల్లా, హిందూపురంలో ప్రజలపై తన దాష్టికాన్ని ప్రదర్శించారు పార్లమెంట్ అధ్యక్షులు గారు. హిందూపురం వైసిపి పార్లమెంట్ అధ్యక్షుడు నవీన్ నిశ్చల్, భూ వ్యవహారాల్లో దళితులను దూషించారంటూ హిందూపురం టూ టౌన్ పోలీసు స్టేషన్‌లో హరిజన ఆదినారాయణ ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు నవీన్ నిశ్చల్‌పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు 384 రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
Must Read ;- అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు.. బీజేపీ వైపు జేసీ చూపు?











