క్రీడా ప్రపంచంలో సరికొత్త జోష్ నింపేందుకు ముహూర్తం కుదిరింది. క్రికెట్ ప్రేమికులను మరోలోకంలోకి తీసుకెళ్లేందుకు ఐపీఎల్ సిద్ధమైంది. క్రికెట్ ప్రేమికులకు శుభవార్త చెప్పింది. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ వేలానికి తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 18న వేలం నిర్వహించనున్నట్టు ఐపీఎల్ ప్రకటించింది.
ఐపీఎల్ వేలం-2021’ తేదీ ఖరారైంది. చెన్నై వేదికగా ఫిబ్రవరి 18న వేలం నిర్వహించనున్నట్టు ఐపీఎల్ ప్రకటించింది. ఈ విషయాన్ని ఐపీఎల్ ట్విటర్ వేదికగా వెల్లడించింది. ‘అలెర్ట్.. ఫిబ్రవరి 18న ఐపీఎల్ వేలం. వేదిక: చెన్నై’ అని ట్వీట్ చేసింది. కాగా, ఈ వేలంలో అత్యధిక సొమ్ముతో పంజాబ్ బరిలోకి దిగనుంది. కింగ్స్ ఎల్‌వెన్ పంజాబ్ వద్ద రూ. 53.2 కోట్లు ఉన్నాయి.
ఏఏ జట్టు దగ్గర ఎంత డబ్బుందంటే…
రాజస్థాన్ రాయల్స్ : 34.85 కోట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: రూ .35.70 కోట్లు
చెన్నై సూపర్ కింగ్స్: రూ. 22.90 కోట్లు
కింగ్స్ ఎలెవన్ పంజాబ్: రూ .53.2 కోట్లు
ముంబై ఇండియన్స్: రూ. 15.35 కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్ : రూ. 12.80 కోట్లు
కోల్‌కతా నైట్ రైడర్స్: రూ .10.85 కోట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్: రూ .10.75 కోట్లు
Must Read ;- క్రికెట్ ప్రేమికులకు చేదు వార్త.. భారత్-పాక్ సమరం అనుమానమే!