విజయ్ దేవరకొండ, సమంత వెండితెర పై రెండవ సారి జతకడుతున్నా విషయం తెలిసిందే. ఈ మూవీకి ఖుషి అనే టైటిల్ ను ఇప్పటికే ఖరారు చేశారు. సామ్ , విజయ్ జోడీగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుండగా.. మహానటి తర్వాత ఈ ఇద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటుండడంతో సినిమా పై అంచనాలు అదే స్థాయిలో మొదలయ్యాయి.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఫస్టులుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. అందులో విజయ్ , సమంతలకు కొంగుముడి వేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. విజయ్ దేవరకొండ మోడ్రన్ లుక్ తో కనిపిస్తుంటే, సమంత సంప్రదాయ బద్ధమైన లుక్ తో కనిపిస్తోంది. ప్రస్తుతం సమంత ‘యశోద’ అనే సినిమా చేస్తుండగా ఇటీవలే ఆ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది..మరోవైపు విజయ్ చేస్తున్న ‘లైగర్’ కూడా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ ఇద్దరు ఆయా చిత్రాల తరువాత చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.
ఇక సమంత ఇటీవల కాలంలో వరుసగా హీరోయిన్ ఒరిఎంటెడ్ మూవీస్ నే ఎక్కువగా చేస్తోంది. ‘మజిలీ’ తరువాత ఆమె మరో ప్రేమకథా చిత్రం ఇప్పటివరకు చేయలేదు.అయితే ఇప్పుడు ఆమె విజయ్ తో జాతకడుతున్న చిత్రం లవ్ స్టోరీ కావడం అందులోనూ అది కూడా మజిలీ సినిమా దర్శకుడితోనే కావడంతో ఈ మూవీ పై అంచనాలు భారీగా నెలకొంటున్నాయి.
ఈ చిత్రాన్ని దర్శకుడు శివ నిర్వాణ రూపొందిస్తున్నారు.మైత్రి బ్యానర్ సంస్థ నిర్మిస్తోంది.ఇక ఈ మూవీని డిసెంబర్ 23వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.