తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయా? సీఎం కేసీఆర్ మరో సారి అంసెబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెల్లే ఆలోచణ చేస్తారా? బీజేపీ విరిసిన సవాళ్ళను అంగీకరించి ఎన్నికలకు వెళితే ఎవరకి లాభం? అసలు ముందస్తు ఎన్నికల తో ప్రజలకు ఒరిగేది ఏంటీ?ఇవన్నీ ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలు?
నిజానికి తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ వ్యూహం ఏంటీ? కేంద్ర మంత్రి అమిత్ షా విరిసిన సవాలును స్వీకరించి ముందస్తు ఎన్నికలకు వెల్లితే ఏం జరుగుతుంది? టీఆర్ఎస్ విజయం సాధిస్తుందా లేక బీజేపీ కి లాభం చేకూరుతుందా?
తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్ ల మద్య రోజు రోజుకు మాటల యుద్ధం పెరిగిపోతోంది. ఒకరు అసెంబ్లీ ని రద్దు చేయాలని, మరొకరు పార్లమెంట్ ను రద్దు చేయాలని సవాళ్లు విసిరి ఒకరి పై మరొకరు నోరుపారేసుకుంటున్నారు.రాష్ట్రంలో రెండవసారి అధికారం చేపట్టిన టీఆర్ఎస్ గతంలో ముందస్తు ఎన్నికలకు వెల్లి విజయం సాధించింది. ప్రస్తుతం కెసిఆర్ సర్కార్ అదే వ్యూహాన్ని మళ్ళీ అనుసరిస్తుందా, లేక కొత్త ఆలోచనతో ముందుకు వెళుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది.
టీఆర్ఎస్ నేతలు మాత్రం ముందస్తు ఎన్నికలు అవసరం లేదని బల్ల గుద్ది చెపుతున్నారు. రాష్ట్రం లో పరిపాలన సవ్యంగా సాగుతోందని.. ఎటువంటి అలజడి లేకుండా ప్రశాంతంగా ప్రజలు జీవిస్తున్నారని వివరించారు. బీజేపీ నేతలు ప్రజల్లో అలజడి సృష్టించి,వారని తప్పుదారి పట్టించేందుకే ముందస్తు ఎన్నికలు అంటున్నారని ఆరోపణ లు వెల్లువెత్తున్నాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు వెల్లాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.
బీజేపీ తెలంగాణ రాష్ట్రం లో అధికారం చేపట్టాలని ఉవ్విలూరుతోంది. అందుకోసం శత విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది.అందులో భాగంగానే రాష్ట్ర అధ్యక్షులుగా బండి సంజయ్ ని నియమించి దూకుడు పెంచింది. ఒక వైపు మాటలు మరో వైపు పాదయాత్ర తో ప్రజల్లోకి వెల్లుతున్నారు.ఈ నేపథ్యం లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రానికి రావడం బగహిరంగ సభల్లో పాల్గొని టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు సిద్దమా అని సవాళు విసరడం చర్చాంశం గా మారింది.రాష్ట్రం లో తాజా రాజకీయ పరిస్థితులు బీజేపికి అనుకూలంగా ఉన్నాయని అందుకే టీఆర్ఎస్ ను రెచ్చగొట్టి ముందస్తు ఎన్నికలకు వెల్లితే బీజేపీ గెలుస్తుందని నేతలు ఆశిస్తున్నారు.ముందస్తు ఎన్నికలు బీజేపీకి కలిసి వస్తాయని నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రం లో బీజేపీ అధికారం లోకి రావాలంటే మాటల తో సరిపోతుందా? అది సాధ్యం కాదు. ఓటర్లను పార్టీ వైపు తిప్పుకుని, ఓట్లను సొమ్ము చేసుకోవాలంటే అది అంత సులువైన పనికాదు. సీఎం కేసీఆర్ వ్యూహం కు మించి వ్యూహాలు చేస్తే గానీ ఓట్లు వచ్చే అవకాశం లేదు.మరో వైపు ప్రజలను ఓటర్లగా మార్చితేగానీ అధికారం రాదు. మరి ఏం చేయాల్సి ఉంది? సంక్షేమ పథకాలు అందిస్తూనే వారి సమస్యలను పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది? కానీ దేశం లో అటు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడాలేని సంక్షేమ పథకాలు తీసుకువచ్చిన సీఎం కేసీఆర్ ప్రజలకు పెద్దన్నగా నిలిచారు. ఇప్పుడు ఎటువంటి పథాకాలు అమలు చేస్తూ,వారు ఆర్ధికంగా ఎదుగేలా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే ప్రధాన అంశం.
ఇక విద్యా,వైద్యం,ఉపాధి కల్పించి ప్రజల్లో చైతన్యం నిపితే వారి ఓట్లను సొమ్ము చేసుకునే అవకాశం ఉంది. బీజేపీ కేంద్రం లో అధికారం చేపట్టిన తర్వాత అన్ని విధాలుగా ప్రజల పై భారం పెరిగింది. నిత్యావసర ధరలు రెట్టింపు తో సామాన్య జనం విలవిలలాడుతున్నారు.గ్యాస్ ధర అమాంతం పెరిగింది. ప్రభుత్వం సంస్థలన ప్రయివేట్ పరం చేస్తున్నారని ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుండి ప్రయివేట్ వ్యక్తులకు సంస్థలకు పెద్దపీట వేయడాన్ని కూడా నిలదీస్తున్నారు. ముందస్తు కు వెల్లాల్సిన అవసరం తెలంగాణ రాష్ట్రం లో లేదు. కేవలం బీజేపీ అధికార దాహం తో ఉందని,అందుకోసమే వారు ముందస్తు అంటున్నారు తప్పా మరేమి లేదు? ఒకవేల టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు వెల్లినా బీజేపీ గెలిచి అధికారం చేపట్టే అవకాశాలు లేవని విశ్లేషకులు భావిస్తున్నారు.











