ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ యాప్ టిక్‌టాక్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కన్నా భారత ప్రధాని మోడీ అంటే భయమా? ప్రస్తుత పరిస్థితిని చూస్తే అవుననే అనిపిస్తోంది. గ్వాలన్ లోయలో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో స్వదేశీ ఉద్యమం ఊపందుకుంది. దీంతో చైనాకు చెందిన టిక్‌టాక్ తో సహా 59 యాప్ లను కేంద్ర ప్రభుత్వం నిషేదించింది. ఈ నిర్ణయంతో చైనా ఆర్థిక రంగానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కరోనాకు చైనానే కారణమంటూ పదే పదే విమర్శలు చేస్తున్న అగ్రరాజ్యం యూఎస్ఏ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా భారత్ బాటలోనే నడిచాడు. ఇదే సమయంలో తమ దేశ పౌరుల సమాచారాన్ని టిక్‌టాక్ సంస్థ సురక్షితంగా ఉంచడం లేదనే ఉద్దేశంతో సెప్టెంబర్ 15 లోగా ఆ సంస్థ కార్యకలాపాలను మూసివేయాలని ఆదేశించాడు.
ట్రంప్ ఆదేశాలు జారీ చేయడంపై టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్ డాన్స్ అమెరికా ఫెడరల్ కోర్టును ఆశ్రయించింది. తాము ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అధికార యంత్రాగం పట్టించుకోవడం లేదని అందుకే కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిందని ఆ సంస్థ ఫిర్యాదులో తెలిపింది. ట్రంప్ రాజకీయ ఉద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయంపై విచారణ జరపాలని కోరారు. ట్రంప్, బిజినెస్ శాఖలపై తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇంత వరకు బాగానే ఉంది కానీ అగ్రరాజ్య అధ్యక్షుడు నిర్ణయాన్నే సవాలు చేసి టిక్‌టాక్ కోర్టుకెక్కడంపై వరల్డ్ వైడ్ ప్రజలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
నరేంద్ర మోడీ తమపై నిషేదించినప్పుడు కోర్టుకు వెళ్లని టిక్‌టాక్ సంస్థ యూఎస్ లో వెళ్లడంతో మోడీ అంటే అంత భయమా అని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే సమయంలో వారు ఓ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అమెరికా కంటే ఇండియా ప్రభుత్వంతో సామరస్యంగా ముందుకు సాగాలని ఆ సంస్థ ఆలోచన చేసిందా? అనే వార్తలు కూడా ప్రచారం జరుగుతున్నాయి. మొత్తం మీద ఇండియా బ్యాన్ చేయడంతో నోరు మెదపని వీడియో స్ట్రీమింగ్ యాప్ యూఎస్ఏ ప్రభుత్వ నిర్ణయంపై ధిక్కార స్వరం వినిపించడం గమనార్హం.











