ఈ మధ్య కాలంలో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన తరువాత ఎక్కడా గ్యాప్ రాకుండా వరుస అవకాశాలను అందుకుంటున్నవారి జాబితాలో నభా నటేశ్ కూడా కనిపిస్తుంది. మంచి హైటూ .. పర్సనాలిటీతో గుమ్మడిపువ్వులా అనిపిస్తుంది. ఆకర్షణీయమైన రూపం వలన మోడ్రన్ డ్రెస్ లలోను .. చీరకట్టులోను చాలా గ్లామరస్ గా కనిపిస్తుంది. కన్నడ ఆడియన్స్ కి కనువిందు చేసిన ఈ బ్యూటీ, ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది. ఈ సినిమాకి వెళ్లిన అందరి మనసులను ఈ పిల్ల నిజంగానే దోచేసింది .. దాచేసింది .. తిరిగి అడగకుండా చేసేసింది.
అలాంటి నభా నటేశ్ కి ‘ఇస్మార్ట్ శంకర్‘ సినిమాతో భారీ హిట్టు పడింది. ఈ సినిమాలో ఈ అమ్మాయి అందాల ఆరబోతను చూసిన పిల్లగాళ్లు, థియేటర్లను వదిలివెళ్లాలంటే దిగాలు పడిపోయారు. ఆ థియేటర్ల నుంచి ఆ సినిమాను తీసేస్తే తమ పరిస్థితి ఏమిటన్నట్టుగా బెంగపట్టేసుకున్నారు. అంతగా పడుచు మనసులను పరుచుకున్న కారణంగానే, ఈ అమ్మాయికి వరుసగా అవకాశాలు వచ్చాయి. ఆ జాబితాలో ‘డిస్కోరాజా‘ .. ‘సోలో బ్రతుకే సో బెటర్’ .. ‘అల్లుడు అదుర్స్’ సినిమాలు కనిపిస్తాయి. మాస్ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేసింది.
అయితే ఈ సినిమాలేవీ కూడా ఆశించిన స్థాయి విజయాలను అందుకోలేదు. ఎంత గ్లామర్ గుమ్మరించినా సినిమా హిట్ అయితేనే ఫలితం దక్కుతుంది. లేదంటే నూనెలో పోసిన తేనెలా పనికిరాకుండా పోతుంది. ప్రస్తుతం ఈ సుందరి చేతిలో ‘మాస్ట్రో‘ సినిమా ఉంది. నితిన్ జోడిగా చేసిన ఈ సినిమాపైనే ఆ అమ్మాయి ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా హిట్ అయితేనే ఈ అమ్మాయి జోరు మరికొంతకాలం పాటు ఇక్కడ కొనసాగుతుంది. ఈ లోగా లౌక్యంతో మరిన్ని మంచి ప్రాజెక్టులను లైన్లో పెట్టేస్తే బాగానే ఉంటుంది. మరి ఆ టాలెంట్ ఈ అమ్మాయికి ఉందో .. లేదో!
Must Read ;- ఉప్పెన బ్యూటీకి డిమాండ్ మామూలుగా లేదుగా..











