ముంబై నుంచి వలస వచ్చిన కథానాయికలు గ్లామర్ షోస్ చేయడంలో దిట్ట అన్న సంగతి తెలిసిందే. ఆ ఉద్దేశంతో సౌత్ దర్శకులు వారిని అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటారు. అయితే అలా వచ్చిన అందరు నాయికలూ.. క్లిక్ అవుతారని లేదు కదా. కొందరు అవకాశాలు రాక.. తెరమరుగవుతారు. మరికొందరు ఐటెమ్ సాంగ్స్ లో సైతం నర్తించి వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. అలాంటి ఓ బ్యూటీ మధురిమ. అమ్మడి అసలు పేరు నైరా బెనర్జీ.
ముంబై లో లా చదివిన మధురిమ.. ఆ తర్వాత హిందుస్థానీ క్లాసిక్ మ్యూజిక్ , గజల్స్ నేర్చుకుంది. నిజానికి జీవి అయ్యర్ తీయాలనుకున్న రామాయణ్ లో సీత పాత్రకు ఎంపికయింది. అయితే ఆయన మరణించడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ తర్వాత మధురిమ.. తెలుగులో ‘ఆ ఒక్కడు’ అనే మూవీతో టాలీవుడ్ లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండానే.. వంశీ ‘సరదాగా కాసేపు’ సినిమాలో కథానాయిక అయిపోయింది. సినిమా హిట్టయినప్పటికీ మధురిమకి అంతగా అవకాశాలు రాలేదు, అలాగే.. కథానాయికగా గుర్తింపూ రాలేదు.
తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో నటించిన మధురిమ .. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. తరచుగా తన హాట్ ఫోటో షూట్స్ తో నెటిజెన్స్ ను కవ్విస్తుంటుంది. తాజాగా మధురిమ పోస్ట్ చేసిన గ్లామర్ పిక్స్ ఇన్ స్టాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. అమ్మడి సెన్సువల్ ఎక్స్ ప్రెషన్స్ కీ, ఆమె పోజులకి కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. ఆమె కథానాయికగా ఎంట్రీ ఇచ్చి 12 ఏళ్ళు అవుతున్నప్పటికీ.. ఆమెలోని మెరుపు ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఈ ఫోటోస్ కు ఓ రేంజ్ లో కామెంట్స్ వచ్చిపడుతున్నాయి.
Must Read ;- డైరెక్టర్ అవ్వాలనుకుంటోన్న ‘వకీల్ సాబ్’ గాళ్