కరోనా మహమ్మారి ఎంతో మంది ప్రాణాలను తీసింది. ఎన్నో జీవితాలను బలి తీసుకుంది. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుందో తెలియక చాలామంది కొవిడ్ బారిన పడ్డారు. కరోనా సోకినా.. తమకు వైరస్ ఎలా సోకిందనే విషయం మరిచి బయట తిరుగుతున్నారు. దాంతో వైరస్ వ్యాప్తి ఎక్కువ అవుతోంది. ఇతరుల ప్రాణాలకూ ముప్పు కలుగుతోంది. కరోనా ఉందా.. లేదా? అనే విషయం తెలిస్తే ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండొచ్చు. త్వరలోనే కరోనాను పసిగట్టే డివైజ్ ఒకటి మన ముందుకు రాబోతోంది.
కొవిడ్ స్మెల్ డిటెక్టర్
కరోనా సోకిన అనే విషయం తెలియక చాలామంది ప్రయాణాలు చేస్తూ, జనసమూహంలో కలుస్తున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు కొవిడ్ స్మెల్ డిటెక్టర్ మార్కెట్లోకి రాబోతుంది. ఇది కరోనా వాసనను ఇట్టే పసిగడుతుంది. ఎవరికైనా కరోనా ఉంటే వెంటనే అలర్ట్ చేస్తుంది కూడా. ఇది సమర్థవంతంగా పనిచేస్తుందా.. లేదా అనే విషయమై పరిశోధనలు కూడా జరిగాయట. లండన్ స్కూల్ ఆఫ్ హైజెనిక్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ సర్వేలో కొవిడ్ రోగులను గుర్తించదట. 90శాతంపైగా ఫలితాలను ఇస్తోందని పలు సర్వేలు సైతం చెప్పాయి. ఈ డివైజ్ కనుక త్వరలో మార్కెట్లోకి వస్తే కొవిడ్ కు ఈజీగా చెక్ పెట్టేయవచ్చు.
Must Read ;- కొత్త వేరియంట్లకు ‘స్పుత్నిక్’ తో చెక్!