తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలంలోని గొల్లవిల్లి గ్రామంలో కరోనా ప్రమాద ఘంటికలు మొగుతున్నాయి. ఈ గ్రామంలో గత 10 రోజుల్లో సుమారు 30 మంది కరోనా కాటుకు బలయ్యారు. ప్రస్తుతం గ్రామంలో ఇంటికొక కరోనా పేషెంట్ చొప్పున ఉన్నారు. కొందరు ఆసుపత్రుల్లో, మరికొందరు ఇంటివద్ద హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. ప్రస్తుతం ఆ గ్రామం మీదుగా వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. గొల్లవిల్లి గ్రామంలో కరోనా విజృంభణపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. 5వేల మంది ప్రజలున్న చిన్న గ్రామం ఇప్పుడు కరోనాతో విలవిల్లాడుతున్న వైనం బాధించిందన్నారు. రెడ్ జోన్ ప్రకటించి, బ్లీచింగ్ చల్లిస్తే అక్కడి ప్రజల్లో భయాందోళనలు తగ్గవన్నారు. తక్షణమే ప్రత్యేక వైద్య బృందాలను అక్కడకు పంపించాలని పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని కోరారు.
అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే..
అమరావతిపై వైసీపీ నేతలు ఎన్ని కుట్రలు పన్నుతున్నా, దేవతల రాజధానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు...











