కర్ణాటక శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ జేడీఎస్ ఎమ్మెల్సీ ధర్మెగౌడ ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిక్కమగళూరు జిల్లా కదుర్ తాలూకా గుణసాగర్ సమీపంలోని రైల్వేట్రాక్ పై ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం ఉదయం 2 గంటల సమయంలో ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
డిసెంబరు 15న కర్ణాటక విధాన పరిషత్ (శాసన మండలి)లో పెద్ద రచ్చ జరిగింది. మండలి ఛైర్మన్ ప్రతాపచంద్ర శెట్టిపై అవిశ్వాస తీర్మానం సందర్భంగా సభ్యలు గొడవ చేశారు. వాగ్వాదాలు, తోపులాటలు జరిగాయి. ఆ సమయంలో సభాపతి స్థానంలో ఉన్న డిప్యూటీ ఛైర్మన్ ధర్మెగౌడను కాంగ్రెస్ సభ్యులు ఆయన సీటులోంచి.. కింది బలవంతంగా లాగేశారు. ఒకవైపు ఆయన పెనగులాడుతూ ఉన్నా.. బలవంతంగా కిందికి లాక్కెళ్లిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యమే ఆయన ఆత్మహత్యకు దారితీసినట్లుగా పలువురు భావిస్తున్నారు.
సోమవారం సాయంత్రం ధర్మెగౌడ ఇంట్లోంచి బయటకు ఒంటరిగా వెళ్లారు. ఆయన గన్ మెన్లు, పోలీసులు గాలించినా దొరకలేదు. చివరికి రైలు పట్టాలపై శవమై కనిపించారు.
ఆయన మరణం కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనాలు సృష్టిస్తోంది.
Must Read ;- ‘రాజకీయం’ సినిమాగా మారితే.. తీపి, చేదు అనుభవాలు