ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీలో ఇల్లు రాలేదని మద్దిపాడు మండలం లింగంగుంటకు చెందిన శ్రీనివాసరావు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వం తరఫున ఇల్లు ఇస్తామని పేరు రాసుకున్నారని.. జాబితాలో పేరు కూడా ఉందని.., తీరా పట్టాలు పంపిణీ చేసే సమయానికి తన పేరు రాకపోవడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని బాధితుని బంధువులు తెలిపారు.
తనకు ఉండేందుకు ఇల్లు లేదని, ప్రభుత్వం అందిస్తున్న పింఛనుతోనే జీవనం సాగిస్తూ కుమార్తెను చదివించుకుంటున్నాడని బంధువులు తెలిపారు. సొంత ఇల్లు ఏర్పడుతుందని ఎంతో ఆశలు పెట్టుకున్న తరువాత.. ఇప్పుడు ఇల్లు కూడా రాకపోవడంతో ఎలా బతకాలి అని పూర్తిగా నైరాశ్యంలో కూరుకుపోయి.. శ్రీనివాసరావు ఈనెల 26న పురుగుల మందు తాగాడని సమాచారం. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మరణించాడు. బాధిత కుటుంబాన్ని వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు పరామర్శించారు.
Must Read ;- ఇంటి పట్టా ఇస్తారా.. చావమంటారా..!