July 24, 2026 9:51 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

‘రాజకీయం’ సినిమాగా మారితే.. తీపి, చేదు అనుభవాలు

సినీ గ్లామర్ ఉన్నా లక్ష్య సాధనకు పట్టుదల, ఓర్పు లేకపోతే రాజకీయంగా రాణించడం కష్టమని గత అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి. సినీ తారలు కొందరు రాజకీయాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకోగా మరికొందరు అనతికాలంలోనే కనుమరుగయ్యారు.

December 5, 2020 at 9:22 PM
in Latest News, National, Politics
MGR and NTR Political History
Share on FacebookShare on TwitterShare on WhatsApp

సినిమా..వినోదం, సందేశాత్మక అంశం.. నిర్ణీత నిడివిలో ప్రేక్షలను ఆకట్టుకునేలా ఉండాలి. రాజకీయం నిరంతరం..ఒకసారి రాజకీయాల్లోకి అడుగుపెడితే నిరంతరం లక్ష్యసాధన కోసం కష్టపడాలి. అసలు లక్ష్య సాధనకు పట్టుదల లేకుంటే.. ఓర్పు లేకపోతే ఎంత సినీ గ్లామర్ ఉన్నా..స్టార్ డమ్ ఉన్నా.. ప్రయోజనం ఉండదు. అంతేకాదు.. ఆయనను నమ్ముకుని వచ్చినవారు రాజకీయంగా, ఆర్థికంగా కూడా నష్టపోవాల్సిన పరిస్థితి. ఇదంతా ఎందుకంటే.. తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. 9నెలల మేథో మథనం తరువాత ఈ ప్రకటన చేశారు.

అయితే రజినీ కాంత్ రాజకీయాల్లోకి రావడంతో రాజకీయ సమీకరణాల్లో మార్పులు రావడం ఖాయం. ఆ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి ఈ సమీకరణాలు మారనున్నాయి. ఇక పార్టీలు పెడుతున్న సినిమా స్టార్లు అనే విషయానికి వస్తే.. అప్పట్లో..ద్రవిడ రాష్ట్రాల్లో రాజకీయాల్లో సంచలనాలు మొదలైందే సినిమా స్టార్లతోనే. తరువాత క్రమేణా ఆ స్టార్ డమ్‌పై ఆధారపడి ఓట్లను రాబట్టుకోవడం కష్టంగా మారుతోంది.

ఎంజీఆర్, ఎన్టీఆర్‌లు చరిత్ర..

తెలుగునాట ఎన్టీఆర్, తమిళనాట ఎంజీఆర్‌ రాజకీయాలను శాసించిన తర్వాత రాజకీయ రంగానికీ, సినిమా రంగానికీ మధ్య విడదీయలేని బంధం ఏర్పడింది. ప్రధానంగా సినీ స్టార్లు రాజకీయాల్లోకి రావడం ఒక ట్రెండుగా మారిందని చెప్పవచ్చు. ఎన్టీఆర్ 57 ఏళ్ల వయస్సులోనే రాజకీయపార్టీ స్థాపించి 9నెలల్లో అధికారంలోకి వచ్చారు. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పార్టీ ప్రజల్లోకి వచ్చింది. అప్పట్లో కాంగ్రెస్ చేతిలో టీ.అంజయ్యకు అవమానం జరిగిందనే చర్చ ప్రజల్లో బలంగా ఉండడం, సీఎంల మార్పులతో ప్రజల్లో విసుగు రావడం, మద్రాసీలుగానే ఇంకా జాతీయ స్థాయి పార్టీల భావించడం కారణాలైతే.. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో రాజకీయ అవకాశాలు లేకపోవడం, స్త్రీలకు సరైన గుర్తింపు లేకపోవడం, సామాజిక ఆర్థిక అసమానతలు ప్రభావిత అంశాలుగా చెప్పవచ్చు. ఇక మిగతా రాష్ట్రాలను చూస్తే..

రాజ్‌కుమార్ : కర్ణాటకలో కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ డైరెక్ట్‌గా పార్టీ పెట్టకున్నా.. ఉద్యమాలు నడిపి.. పార్టీలను శాసించారు. కన్నడ భాషోద్యమంలో ఆయన పాత్ర విడదీయలేనిది. ఆయన కారణంగానే కన్నడ మాద్యమ విద్యాబోధన తప్పనిసరి చేస్తూ అప్పట్లోనే చట్టం వచ్చేలా చేశారు.

Must Read ;- సూపర్ స్టార్ రజినీ కాంత్ ఆరోగ్యంపై వదంతులు

MGR లెజెండ్: ఎంజీ రామచంద్రన్ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచమయే.. తొలుత అన్నదురై నేతృత్వంలోని డీఎంకేలో చేరారు. 1972లో అన్నదురై మరణించారు. డీఎంకేలోని కరుణానిధితో విభేదాలు తలెత్తాయి. దీంతో ఆలిండియా అన్న ద్రవిడ మున్నెట్ర కళగం పార్టీని పెట్టారు. 1977లో సీఎం అయ్యారు. పార్టీ పెట్టాక 5ఏళ్లపాటు పోరాడారు. తమిళనాట రాజకీయ పార్టీలన్నీ ఈయనకు భారతరత్న ఇవ్వాలని చాలాకాలం డిమాండ్ చేశాయి. ఆయన మరణించాక.. ఏడాదికి 1988లో భారతరత్న లభించింది.

జయలలిత: ఈమె గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. తెలుగు వాళ్లకు కూడా నటిగా సుపరిచితం అయిన అమ్మ.. ఆ తర్వాత అన్నాడిఎంకే పగ్గాలు తీసుకుని రెండున్నర దశాబ్ధాల పాటు తమిళనాట చక్రం తిప్పారు. దక్షిణ భారతదేశంలో రాజకీయాల్లో సక్సెస్ ఫుల్ గా పార్టీలు పెట్టి రాజకీయాలు నడిపిన వారిలో వీరు ప్రధానంగా కనిపించారు.

దేవానంద్ :  ఇక స్టార్ డమ్ ఉన్న సమయంలో పార్టీలు పెట్టి..తరువాత రకరకాల కారణాలతో పార్టీలు కనిపించడకుండా పోవడమో లేక అస్తిత్వం కోసం పోరాడే పరిస్థితి ఉన్న పార్టీలు చాలానే ఉన్నాయి. వీరిలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన బాలీవుడ్ స్టార్ దేవానంద్. ఆయన 1980ల్లో నేషనల్ పార్టీ ఆఫ్ ఇండియా పెట్టారు. చాలా అంచనాలతో  ప్రారంభమైన పార్టీ ఇది. అయితే ఒక్క ఎన్నికల తరువాతే ఆ పార్టీ కనుమరుగైంది.

శివాజీ గణేషన్ : ఇక తమిళనాడులో మరో నటుడు శివాజీ గణేషన్ కూడా పార్టీ పెట్టారు. డీఎంకే నుంచి విభేదించి పార్టీ పెట్టిన శివాజీ గణేషన్ తమిళగ మున్నెట్ర మున్ననై పేరుతో పార్టీ పెట్టారు. 1989లో ఈ పార్టీ దారుణమైన ఓటమి చవి చూసింది. తరువాత పార్టీని జనతాదళ్‌లో కలిపారు.

విజయకాంత్:  మరో తమిళ సినీ నటుడు విజయ్‌కాంత్ కూడా 2005లో దేశియ ముర్పోర్కు ద్రవిడ కళగం పేరుతో పార్టీ పెట్టారు.2006 ఎన్నికల్లో రాష్ట్రంలోని 234 స్థానాల్లో పోటీ చేస్తే.. ఒక్క స్థానంలో మాత్రమే గెలిచారు. 2011లో ఏఐఏడీఎంకేతో పొత్తు పెట్టుకున్నారు. 41 సీట్లలో  పోటీ చేసి 29 సీట్లను గెల్చుకుంది విజయకాంత్ పార్టీ. తరువాత 2016 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయగా ఒక్క సీటూ దక్కలేదు. లోక్‌సభ ఎన్నికల్లోనూ పెద్దగా ప్రభావం చూపలేక పోయారు. వచ్చే ఎన్నికల్లో పరిస్థితి ఏంటన్నది పార్టీకే క్లారిటీ లేని పరిస్థితి. విజయకాంత్ ఆరోగ్య పరిస్థితి కూడా సహకరించడం లేదని పార్టీ నాయకులు చెబుతున్నారు.

Also Rread ;- అక్కడ విజయ్.. ఇక్కడ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమేనా?

కర్ణాటకలో ఉపేంద్ర: కర్ణాటకలోనూ రాజకీయాల్లోకి వచ్చిన వారు ఉన్నా..పార్టీ పెట్టిన వారు తక్కువే. తాజాగా రియల్ స్టార్‌గా పేరున్న ఉపేంద్ర కర్నాటక ప్రజన్వత జనతా ప్రకాశ ( కేపీజేపీ)- ఉత్తమ ప్రజా పార్టీ పెట్టారు. రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ బరిలోకి దిగనుంది.  కంపెనీల్లో స్థానికులకే 70 శాతం ఉద్యోగాలని అప్పట్లో ఆయన చేసిన ప్రకటన సంచలనం రేపింది.

తెలుగు రాష్ట్రాల్లో..

విజయశాంతి: ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే..ఎన్టీఆర్ తరువాత సినిమా స్టార్లు పార్టీలు పెట్టినా సక్సెస్ కాలేదు. 2005లోనే విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీ పెట్టినా.. ఎన్నికల్లోనూ పోటీ చేయలేక పోయారు.2009లో టీఆర్ఎస్‌లో విలీనం చేశారు.

హరికృష్ణ: ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ అన్న తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసినా.. నడపలేకపోయారు. టీడీపీలో విలీనం చేశారు.

చిరంజీవి: తెలుగురాష్ట్రాల్లో ఈ పార్టీ ఓ సంచలనం. 26 ఆగస్టు 2008న తిరుపతిలో జరిగిన పార్టీ ప్రారంభోత్సవ సభ చూస్తే.. అప్పటి కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్‌లు ఓడిపోవడం ఖాయం అన్న ఇమేజ్‌తో వచ్చింది ప్రజారాజ్యం పార్టీ. అయితే ప్రారంభోత్సవం, కమిటీల ఏర్పాటు బాగానే ఉన్నా, ఎన్నికల సమయంలోనే అసలైన పరీక్ష ఎదురైంది. పలు ఆరోపణలు వచ్చాయి. 294 స్థానాల్లో పోటీ చేస్తే 18 సీట్లు మాత్రమే వచ్చాయి.  చిరంజీవి తన సొంత ప్రాంతమైన పాలకొల్లులో ఓడిపోయారు. తిరుపతిలో గెలిచారు. ఎంతోకాలం పార్టీని నడపలేక పోయారు. 2011లో కాంగ్రెస్‌లో కలిపారు. ఆ పార్టీ గెలవడం విషయం పక్కన బెడితే.. టీడీపీకి అధికారం దక్కకుండా చేసేందుకు కాంగ్రెస్‌కి ఉపయోగపడిందని అప్పట్లోనే రాజకీయ వర్గాల్లో చర్చ నడిచింది.

పవన్ కల్యాణ్: 2014లో జనసేనను రాజకీయ పార్టీగా మార్చారు. తొలుత బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చారు. 2019 ఎన్నికల్లో  ఒంటరిగా పోటీ చేసి ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమ సాధించగలిచారు.

రానున్న కాలంలో తేలాల్సినవి..

  • ప్రస్తుతం తమిళనాడులో చాలా పార్టీలు కొత్తగా వచ్చాయి. కమల్ హాసన్ ‘మక్కల్ నీది మయ్యమ్’ పార్టీ తరుపున  తమిళనాడులోని 39 లో‌క్‌సభ సీట్లకు పోటీ చేస్తున్నారు.  ఈయనకు ఎలక్షన్ కమిషన్ టార్చిలైట్ గుర్తును కేటాయించింది. రానున్న కాలంలో ఆయన ప్రభావం ఎంత అనేది తేలాలి.
  • విశాల్ కూడా ఫ్యాన్ క్లబ్ ‘మక్కల్ నాలా ఇయక్కమ్’ను రాజకీయ పార్టీగా మార్చారు. ఆ పార్టీ ఎన్నికల బరిలో ఉంటుందా లేదా అనేది తేలాలి.
  • తాజాగా రజినీకాంత్ కూడా పార్టీ ఏర్పాటును ఖరారు చేశారు.
  • టి.రాజేంద్రన్ ఆలిండియా లట్చియ ద్రవిడ మున్నెట్ర కళగం పేరుతో పార్టీ ఏర్పాటు చేశారు.
  • శరత్ కుమార్.. ఆలిండియా సమత్తువ మక్కల్ కట్చీ( ఏఐఎస్ఎంకే) పేరుతో పార్టీ పెట్టారు. వీరిలో కమల్ హాసన్, రజనీలకు ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పాటు రాజకీయాలతో ప్యత్యక్షంగా కాని, పరోక్షంగా కాని సంబంధాలున్నాయి.
  • కేరళలో మాత్రమే సినిమా స్టార్లు పెద్దగా పార్టీలు పెట్టడం లేదు. మమ్ముట్టి, సురేష్ గోపి, మోహన్ లాల్ లాంటివారు పార్టీలకు సానుభూతిపరులుగా ఉన్నా..పార్టీలు పెట్టడం చాలా తక్కువ అని చెప్పవచ్చు.

ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ పెట్టడం ఒక ఎత్తయితే ప్రజల్లోకి పార్టీని తీసుకువెళ్లడం, అభ్యర్థుల ఎంపిక, టిక్కెట్ల కేటాయింపు, సామాజిక సమీకరణాలు, ఆర్థిక వనరులు, తిట్టడం-తిట్టించుకోవడం, ఒక వేళ పార్టీ ఓడిపోయినా.. కనీసం దశాబ్దకాలం నడిపేంత ఓపిక, ఓర్పు ఇవన్నీ మరో ఎత్తు. మరి రానున్న కాలంలో విమర్శల విషయంలో సున్నితంగా స్పందించే కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి వారు విమర్శలను తట్టుకోగలుగుతారా..పోరాడగలుగుతారా అనేది చూడాలి.

Also Read ;- క్రియాశీలక రాజకీయాల్లోకి శశికళ

Tags: aiadmkaidmkcinema hero's political entrykamal hasanm. karunanidhimammuttimegastar chiranjeevimohan lalrajinikanth political entrysivaji ganesansouth super star rajanikanthsr ntrstardom in politics sucsess and failuressuresh gopitamil super star mgrtamilanadu politicstelugu newsthe leo news teluguThe leonewsVijayashanthi
Previous Post

తెలంగాణ ఫలితాలు.. ఏపీ విపక్షాలకు ఆశాకిరణాలు!

Next Post

అభినయ సముద్రం సావిత్రి (జయంతి ప్రత్యేకం)

Related Posts

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

by లియో డెస్క్
July 23, 2026 7:45 pm

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో...

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

by లియో డెస్క్
July 20, 2026 5:57 pm

వైసీపీ హయాంలో జరిగిన అధికార దుర్వినియోగం, భూ ఆక్రమణల లీలలు ఇప్పుడు ఒక్కొక్కటిగా...

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

by లియో డెస్క్
July 16, 2026 5:22 pm

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు హిట్ అండ్ రన్‌ ఘటన..దానిపై వైసీపీ...

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

by లియో డెస్క్
July 13, 2026 7:45 pm

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు...

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

by లియో డెస్క్
July 13, 2026 6:00 pm

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై.. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నేత నాగార్జున...

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

పువ్వాడ పుత్రరత్నానికి పాలిటిక్స్ వద్దా?

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

సినిమాలకు ఆ బూతే ఇక భవిష్యత్

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

మంత్రం 108 సార్లే ఎందుకు చదవాలి?

సూపర్’ న్యూస్ ని ఎందుకిలా చేశారు?

సీఎం జగన్ తో భేటీకి వెళ్లిన మెగా బృందం

వివాదంగా మారిన రమణదీక్షితుల నియామకం

ముఖ్య కథనాలు

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist