శర్వానంద్, సిద్ధార్థ హీరోలుగా రూపొందుతున్న ‘మహాసముద్రం’ థీమ్ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. దీపావళి సందర్భంగా ఈ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆర్.ఎక్స్. 100 చిత్ర దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో అదితీరావు హైదరీ, అనుఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
విడుదల థీమ్ పోస్టర్ చూస్తుంటే ఇది ఓ లవ్ సినిమా మాదిరి అనిపిస్తోంది. ‘నేను తరంగాల కంటే మొండిగా ఉన్నా.. సముద్రాల కంటే లోతుగా ఉన్నా’ అంటాడు శర్వా. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లి త్వరలోనే షూటింగ్ పూర్తచేసుకోనుంది. తక్కువ షూటింగ్ డేట్స్ తో ఈ సినిమాని పూర్తి చేయాలన్న సంకల్పంతో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది.
I'm stubborn than the waves, deep as the seas! @aditiraohydari @Actor_Siddharth @ItsAnuEmmanuel Who are you? #MahaSamudram #ThemePoster 🌊 #HappyDiwali 🪔@DirAjayBhupathi @AnilSunkara1 @AKentsOfficial pic.twitter.com/MGHfjfaFb8
— Sharwanand (@ImSharwanand) November 14, 2020