యువ సమ్రాట్ నాగచైతన్య – ఫిదా బ్యూటీ సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం లవ్ స్టోరీ. ఈ చిత్రానికి సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. విభిన్న ప్రేమకథా చిత్రంగా రూపొందిన లవ్ స్టోరీ ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాలి కానీ.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు అన్ని అడ్డంకులను దాటుకుని లవ్ స్టోరీ ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది.
ఇటీవల జరిగిన లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి – బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ముఖ్య అతిధులుగా హాజరు కావడం… ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సస్ అవ్వడంతో లవ్ స్టోరీ పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇప్పుడు లవ్ స్టోరీ మూవీ గురించి సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ లో స్పందిస్తూ… డ్యాన్స్ నేపధ్యంతో రూపొందిన చిత్రం లవ్ స్టోరీ. ఇలా డ్యాన్స్ నేపథ్యంలో సినిమా రూపొందడం తెలుగులో చాలా అరుదు. ఈ సినిమాని థియేటర్లో చూసేందుకు ఎప్పుడెప్పుడు వస్తుంది అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. లవ్ స్టోరీ టీమ్ కి ఆల్ ది బెస్ట్ అని చెప్పారు.
మహేష్.. లవ్ స్టోరీ పై కామెంట్ చేయడంతో ఈ సినిమా పై మరింత ఆసక్తి ఏర్పడింది. రోజురోజుకు లవ్ స్టోరీ పై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ నెల 24న విడుదల అవుతుంది. టీమ్ అంతా లవ్ స్టోరీ సక్సస్ పై గట్టి నమ్మకంతో ఉన్నారు. మజిలీ, వెంకీమామ తర్వాత వస్తున్న నాగచైతన్య సినిమా కావడంతో హ్యాట్రిక్ సాధించడం ఖాయం అంటున్నారు అక్కినేని అభిమానులు.
Must Read ;- యూత్ కి కనెక్ట్ అయ్యేలా ‘లవ్ స్టోరీ’ ట్రైలర్











