యువ సమ్రాట్ అక్కినేని నాగచైతన్య – సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్లో రూపొందిన విభిన్న ప్రేమకథా చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ.. ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. అన్నీ అడ్డంకులును దాటుకుని సెప్టెంబర్ 10న లవ్ స్టోరీ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించారు. ఎప్పటి నుంచో లవ్ స్టోరీ మూవీ కోసం ఎదురు చూస్తున్న అక్కినేని అభిమానులు ఈ సినిమా రిలీజ్ అవుతుందని తెగ సంబరపడ్డారు. అయితే… కొన్నికారణాల వలన లవ్ స్టోరీ మూవీని మళ్లీ వాయిదా వేసారని తెలిసింది.
అయితే.. ఇప్పుడు టైమ్ ఉండడంతో లవ్ స్టోరీకి మళ్లీ రీ షూట్స్ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ రీషూట్స్ షూటింగ్ ని వీలైనంత త్వరగా ఫినిష్ చేయనున్నారని తెలుస్తోంది. శేఖర్ కమ్ముల సీన్స్ పర్ఫెక్ట్ గా రావడం కోసం గతంలో కూడా తన సినిమాల్లో రీ షూట్స్ చేసిన సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల అడగడంతో చైతు కూడా రీషూట్స్ చేయడం కోసం డేట్స్ ఇచ్చారట. సాధ్యమైనంత త్వరగా రీషూట్ వర్క్ కంప్లీట్ చేయనున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం లవ్ స్టోరీ చిత్రాన్ని సెప్టెంబర్ చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది.
లవ్ స్టోరీ న్యూరిలీజ్ డేట్ పై చిత్ర యూనిట్ త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది. మజిలీ, వెంకీమామ చిత్రాలతో వరుసగా సక్సస్ సాధించిన చైతన్య లవ్ స్టోరీ మూవీతో హ్యాట్రిక్ సాధిస్తాడని గట్టి నమ్మకంతో ఉన్నారు అభిమానులు. మరి.. లవ్ స్టోరీ సినిమాతో చైతన్య ఆశించిన విజయం సాధించి హ్యాట్రిక్ సాధిస్తాడని ఆశిద్దాం.











