అసెంబ్లీ సమీపంలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్న సమయంలో ఇలాంటి ఘటన జరగడంతో పోలీసులు, అక్కడ ఉండే చుట్టుపక్కలవారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థి నెలకొంది. వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్న సమయంలోనే తన వెంట సీసాలో తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకొని నినాదాలు చేస్తూ బలవన్మరణానికి పాల్పడినాడు. అక్కడే ఉన్న పోలీసులు మంటలార్పి అతనిని ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ వచ్చిన తరువాత నాకు ఎలాంటి న్యాయం జరగలేదని ఆరుచుకుంటు పెట్రోల్ పోసుకున్నట్లు స్థానికులు వెల్లడించారు. జై తెలంగాణ అంటూ నినాదాలు కూడా చేసుకుంటూ కేసిఆర్ సర్ న్యాయం చేయమని బాధితుగు అరిచినట్లు వారు తెలిపారు. తనకు బతకడానికి పనిలేదంటూ అరిచినట్లు పేర్కొన్నారు. ఆత్మహత్యత్నం చేసుకున్న వ్యక్తి కడ్తల్ గ్రామ వాసిగా అతని పేరు నాగులు.. తండ్రి పేరు రాములుగా పోలీసులు గుర్తించినట్లు తెలిసింది.అతను ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్ అయి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అయితే గాయపడిన ఆ వ్యక్తిని పోలీసులు ఆటోలో ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. 50 శాతం వరకు శరీరం కాలినట్లు ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం అతని పరిస్థతి నిలకడగానే ఉన్నట్లు తెలిసింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో పదుల సంఖ్యలో పోలీసు బందోబస్తూ నడుమ మధ్య ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడంపట్ల అందరూ అశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో పోలీసులు మరింతగా అప్రమత్తమయ్యారు.











